సల్మాన్ ఫామ్‌హౌస్ పార్టీలో రామ్ చరణ్ వాట్టూడూ?
అందుకే ఇప్పుడు ముంబై ఔటర్ లోని పన్వేల్ ఫామ్ హౌస్ లో సల్మాన్ భాయ్ ప్రత్యేకంగా షష్ఠిపూర్తి (60వ పుట్టినరోజు) వేడుకలు జరుపుకోగా, ఈ వేడుకలకు రామ్ చరణ్ ప్రత్యేక జెట్ లో వెళ్లాడు.;
నాకు మూడో తమ్ముడు ఉంటే అది రామ్ చరణ్ మాత్రమేనని చాలాసార్లు సల్మాన్ ఖాన్ అన్నారు. మెగా కుటుంబంతో బాలీవుడ్ సూపర్‌స్టార్ అనుబంధం అలాంటిది. మెగాస్టార్ చిరంజీవిని, ఆయన డ్యాన్సులను విపరీతంగా ఆరాధిస్తారు సల్మాన్ ఖాన్. మెగాస్టార్ కి కూడా సల్మాన్ అంటే అంతే అభిమానం. సల్మాన్ హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తుంటే చిరు ఇంటి నుంచి భోజనం క్యారేజీ వెళుతుంది. అంతెందుకు... చిరంజీవి లేదా రామ్ చరణ్ ముంబైలో అడుగుపెడితే అక్కడ అన్నిటికీ సల్మాన్ తానున్నానని అంటాడు. అతిథి మర్యాదలు తక్కువ కానివ్వడు. అలాంటి గొప్ప అనుబంధం వారి మధ్య ఉంది.
సల్మాన్ ఖాన్ నటించిన కొన్ని సినిమాల షూటింగులు హైదరాబాద్ లో జరిగాయి. ఆ సమయంలో చిరు, చరణ్ నేరుగా సల్మాన్ ని సెట్లో కలిసి ఆతిథ్యానికి ఆహ్వానించిన సందర్భాలు అనేకం. రామ్ చరణ్ జంజీర్ షూటింగ్ చేసేప్పుడు ముంబైలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సల్మాన్ ఖాన్ చూసుకున్నారు. సల్మాన్ ఖాన్ మెగా కుటుంబంలో భాగం. అలాగే చిరు, చరణ్ కూడా భాయ్ కుటుంబంలో ఒక భాగం. అలాంటి చనువు, స్నేహానుబంధం వారి మధ్య ఉంది.
అందుకే ఇప్పుడు ముంబై ఔటర్ లోని పన్వేల్ ఫామ్ హౌస్ లో సల్మాన్ భాయ్ ప్రత్యేకంగా షష్ఠిపూర్తి (60వ పుట్టినరోజు) వేడుకలు జరుపుకోగా, ఈ వేడుకలకు రామ్ చరణ్ ప్రత్యేక జెట్ లో వెళ్లాడు. అక్కడ సల్మాన్ కి బర్త్ డే విషెస్ చెప్పడమే కాదు, భాయ్ తో సరదాగా చాలా సేపు ఆటలు ఆడుకున్నాడు. పాటలు పాడాడు. ఆ ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ జోవియల్ గా కనిపించారు. ఇక పార్టీలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా చేరడంతో సల్మాన్, ధోనీలతో చరణ్ చాలాసేపు జాలీగా గడిపాడు. ప్రస్తుతం పన్వేల్ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించిన చాలా ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో చరణ్ కూడా అంతే హైలైట్ అయ్యాడు.
పార్టీలో సల్మాన్- చరణ్ మధ్య విడదీయరని అనుబంధం కనిపించిందనిప ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పారు. ఆ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు... నవ్వుకున్నారు.. ఒకరినొకరు ఆటపట్టించుకున్నారు.. ఇతర అతిథులను కలిశారు.. అయితే సల్మాన్ గానీ, రామ్ చరణ్ గానీ ఒక్క చుక్క మద్యం కూడా ముట్టుకోలేదు. `పెద్ది` సినిమాలో తనకు అతిథి పాత్ర ఎందుకు ఇవ్వలేదని సల్మాన్ సరదాగా ఫిర్యాదు కూడా చేశాడని కూడా తెలుస్తోంది.
మెగా కుటుంబంతో అనుబంధం:
సల్మాన్ తన టీనేజీ నుంచి చిరంజీవికి వీరాభిమాని. చిరు డ్యాన్సులను అతడు ఎంతగానో ఇష్టపడతాడు. చిరు కుమారుడు రామ్ చరణ్ ముంబైలో తన బాలీవుడ్ తొలి చిత్రం జంజీర్ షూటింగ్ చేస్తున్నప్పుడు సల్మాన్ ప్రతిరోజూ రామ్ చరణ్ సెట్‌కు భోజనం పంపించేవాడు. చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో నటించినప్పుడు ఒక్క పైసా కూడా తీసుకోనని సల్మాన్ పట్టుబట్టారు. గాడ్‌ఫాదర్‌లో అతిథి పాత్రకు చిరంజీవి నిర్మాతలు సల్మాన్‌కు రూ. 15-20 కోట్లు చెల్లించాలనుకున్నారు. కానీ సల్మాన్ పట్టుబట్టాడు. డబ్బు చెల్లించాలని పట్టుబడితే తాను ఆ అతిథి పాత్ర చేయనని చిరంజీవితో చెప్పాడు. చిరంజీవితో ఆ సమయంలో సల్మాన్ ఇలా అన్నారు. ``నా సినిమాలో ఒక పాత్ర చేయమని నేను మిమ్మల్ని అడిగితే.. మీరు దానికి డబ్బు తీసుకుంటారా?``.. ఈ ప్రశ్న చిరంజీవిని కదిలించి, నిశ్చేష్టుడిని చేసిందని కూడా కథనాలొచ్చాయి.
హైదరాబాద్ పార్క్ హయత్ లో మెగాస్టార్ చిరంజీవి షష్ఠిపూర్తి వేడుకలను ఏర్పాటు చేయగా, సల్మాన్ ఖాన్ ముంబై నుండి ప్రైవేట్ జెట్‌లో వచ్చి.. అక్కడ చాలా సరదాగా గడిపారు వేదికపై చిరంజీవి హిట్ పాటల రీమిక్స్‌కి సల్మాన్ డ్యాన్సులు కూడా చేసాడు. ఆ సమయంలో సల్మాన్ అభిమానానికి చిరంజీవి ఆనందంతో పొంగిపోయారు.
సల్మాన్ పట్టుబట్టడంతో కొరియోగ్రాఫర్ కం దర్శకుడు ప్రభుదేవా.. సల్మాన్ నటించిన `దబాంగ్ 3`లోని `మున్నా బద్నామ్ హువా` డ్యాన్స్ నంబర్‌లో చిరంజీవి ఐకానిక్ `వీణ స్టెప్`ను చేర్చారు. ఈ పాటలో సల్మాన్ భారతీయ సంగీత వాయిద్యమైన వీణ ఆకారంలో కదులుతూ నృత్యం చేసారు. దానికి స్ఫూర్తి చిరంజీవి. చిరంజీవి నటించే ఏ సినిమాలోనైనా తాను కూడా భాగం కావాలని సల్మాన్ కోరుకుంటారు.. సల్మాన్- చిరంజీవి అనుబంధం అద్భుతం అని ఇన్ని విషయాలు తెలిసాక అంగీకరించకుండా ఉంటారా?