మారుతిని తక్కువ అంచనా వేశారు కానీ..?
యువ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలతో కూడా మారుతి సినిమాలు చేస్తూ వచ్చాడు.;
ఈ రోజుల్లో సినిమాతో మొదలైన డైరెక్టర్ మారుతి కెరీర్ మొదటి రెండు సినిమాల్లో తన అడల్ట్ సీన్స్ చూసి ఆడియన్స్ కాస్త అప్సెట్ అయినా ఆ తర్వాత ఆయన పంథా మార్చి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తుండటం తో ఇంప్రెస్ అయ్యారు. ఇక మారుతి సినిమా అంటే చాలు పక్కా ఎంటర్టైన్ అవుతామని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అంతగా తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మారుతి. ఐతే అలాంటి మారుతి ఇన్నాళ్లు టైర్ 2 హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. అఫ్కోర్స్ విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో సినిమా చేశాడు. అది అంత గొప్ప రిజల్ట్ అందుకోలేదు.
బాహుబలి తో పాన్ ఇండియా క్రేజ్..
యువ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలతో కూడా మారుతి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఐతే సడెన్ గా మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటూ ప్రచారం మొదలైంది. బాహుబలి తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత కూడా అదే లైనప్ తో నేషనల్ లెవెల్ ఆడియన్స్ టార్గెట్ తోనే సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ప్రభాస్ మారుతి తో సినిమా అనగానే ముందు రెబల్ ఫ్యాన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే సినిమా అనౌన్స్ మెంట్ లాంటివి ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టారు.
సినిమా నుంచి మొదటి టీజర్ వచ్చేంత వరకు కూడా మారుతి మీద రెబల్ ఫ్యాన్స్ నిరుత్సాహంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాజా సాబ్ టీజర్ వచ్చిందో అప్పుడు మారుతి సైడ్ నుంచి ఆలోచించడం మొదలు పెట్టారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్దీ మారుతి ఇస్తున్న సర్ ప్రైజ్ లు చూసి షాక్ అవ్వడం రెబల్ ఫ్యాన్స్ వంతు అయ్యింది. లేటెస్ట్ గా రాజా సాబ్ నుంచి రెండో ట్రైలర్ రిలీజైంది.
మారుతి మీద కాన్ఫిడెన్స్..
ఈ ట్రైలర్ లో విజువల్స్ చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ తో పాటు సినిమా కథ కూడా చాలా పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్ లతో ఉండేలా ఉందని రెండో ట్రైలర్ తో తెలుస్తుంది. మొత్తానికి రాజా సాబ్ ట్రైలర్ తో ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక మాస్ ఫీస్ట్ ఇస్తుందని నమ్మకం కలిగేలా చేశాడు మారుతి. ముందు ఆయన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కానీ రాజా సాబ్ ట్రైలర్ చూశాక కానీ మారుతి మీద ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడలేదు.
మారుతి అనే కాదు ప్రభాస్ తను కథ ఎంపిక చేసుకునే విధానంలో దర్శకుడు ఆ కథను ఎలా తీయగలడు అనే నమ్మకం తోనే సినిమా కమిట్మెంట్ ఇస్తాడు. తప్పకుండా రాజా సాబ్ తో ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ ని మారుతిని అన్ని విధాలుగా వినియోగించుకునేలా ఉన్నాడని అనిపిస్తుంది. మారుతి మాత్రం ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సంక్రాంతికి ఈసారి అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ బేస్ తోనే వస్తుండగా రాజా సాబ్ తో ప్రభాస్ భయపెట్టించి మరీ నవ్వించడానికి వస్తున్నాడు.