దళపతి ఫాదర్ మౌనానికి అర్థమేంటీ?
అయితే గత కొంత కాలంగా విజయ్ చుట్టూ జరుగుతున్న నాటకీయ పరిణామాలపై ఆయన ఎందుకు స్పందించడం లేదు.;
విజయ్ ఫాదర్ ఎస్.ఏ. చంద్రశేఖర్ మౌనం పాటిస్తున్నారు. ఒక దశలో విజయ్ తన మాట వినడం లేదని విమర్శలు చేసి రచ్చకు దిగిన ఎస్.ఏ. చంద్రశేఖర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? విజయ్ చుట్టూ ముప్పెట దాడి జరుగుతున్నా,కోడలు విడాకులకు కోర్టుని ఆశ్రయించినా పెదవి విప్పడం లేదు అన్నది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తన తనయుడు విజయ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుదుచ్చేరి శాసన సభ్యుడు బుషీ ఆనంద్‌ను గుడ్డిగా నమ్ముతున్నాడని, రాజకీయాల్లో అంత గుడ్డితనం పనికి రాదన్నారు.
తప్పుడు వ్యక్తుల ప్రభావంలో చిక్కుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో తన కుమారుడి కాల్షీట్స్,వ్యక్తిగత విషయాలని తానే చూసుకునేవాడినని, అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. గత కొన్ని నెలల క్రితం పార్టీ జెండా వినియోగం విషయంలో తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విజయ్ తండ్రితో మాట్లాడటం మానేశాడనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల వల్ల తిరిగి ఇద్దరూ ఒకటయ్యారని, ఇప్పుడు తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తన తనయుడు విజయ్‌కి అండగా నిలబడ్డారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే గత కొంత కాలంగా విజయ్ చుట్టూ జరుగుతున్న నాటకీయ పరిణామాలపై ఆయన ఎందుకు స్పందించడం లేదు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్ నటించిన `జన నాయగన్` రిలీజ్ విషయంలో సెన్సార్ వివాదం తలెత్తిన సందర్భంలో మాట్లాడి అభిమానుల్లో ధైర్యాన్ని నింపిన చంద్రశేఖర్ తాజాగా విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించడం, విజయ్ రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్‌లో త్రిషతో కలిసి ఫొటోలకు పోజులివ్వడం వంటి వాటిపై ఎందుకు స్పందించడం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
విజయ్ భార్య సంగీత ఇటీవల చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో విజయ్‌తో విడాకులు కోరుతూ కోర్టుని ఆశ్రయించింది. పిటీషన్ దాఖలు చేసిన కొన్ని రోజులవుతున్నా, దీనిపై చర్చ జరుగుతున్నా చంద్రశేఖర్ మాత్రం పెదివి విప్పడం లేదు. కొడుకు విజయ్ గురించి కానీ, కోడలు సంగీత గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. మౌనం పాటిస్తూ వస్తున్నారు. వరుస వివాదాలు చుట్టుముడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా విజయ్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. విమర్శలు, వివాదాలు ఎన్ని ఎదురైనా ఐ డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు.
రీసెంట్‌గా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కి త్రిషతో కలిసి విజయ్ పంచె ధరించి సంప్రదాయ దుస్తుల్లో రావడమే ఇందుకు నిదర్శనం. తమపై వస్తున్న పుకార్లకు తాజా వెడ్డింగ్ రిసెప్షన్‌తో విజయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి తాజా పరిస్థితులపై, విజయ్, త్రిష గురించి జరుగుతున్న ప్రచారంపై విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ఇప్పటికైనా స్పందించి క్లారిటీ ఇస్తారా?..లేక జరుగుతున్న ప్రచారాన్నే నిజమనుకోమంటారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.