అమెరికన్ యాంకర్‌కు ఐశ్వర్యరాయ్ పవర్‌ఫుల్ కౌంటర్!

అప్పుడెప్పుడో ఒకరోజు అంతా కలిసి డిన్నర్ చేసే అవకాశం దొరుకుతుంది. అలాంటి అరుదైన క్షణాలను మేము ఎంతో విలువైనవిగా భావిస్తాము` అన్నారు.

Update: 2026-09-14 07:21 GMT

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గ‌డించినా? భారతీయ సంస్కృతికి, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నటీమణుల్లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒకరు. గ్లోబల్ వేదికలపై దేశ ప్రతిష్టను నిలబెడుతూనే మూలాలను ఎన్నడూ మరువని ఐష్ వ్యక్తిత్వం ఆదర్శవంమ‌తైంది. పెళ్లయ్యే వరకు తల్లిదండ్రులతోనే నివసించిన ఐశ్వర్య ఓ ఇంట ర్వ్యూలో భారతీయ కుటుంబ వ్యవస్థ, స్వేచ్ఛ , విదేశీ జీవనశైలులపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికాలో చిన్న వయసులోనే పిల్లలు తల్లిదండ్రుల ఇంటిని వదిలి వేరుగా వెళ్లే పద్ధతిపై ఐష్ ఆసక్తికరంగా మాట్లాడారు.

అమెరికాలో అలా ఉండ‌టం అనేది అక్క‌డ ప్రజల సొంత నిర్ణయమా? లేక సమాజం విధించిన నిబంధనా? అని ప్రశ్నించారు. దానికి డెవిడ్ లెట‌ర్ మెన్ అమెరికాలో 30 ఏళ్ల వయసు ఉండి.. మంచి కెరీర్, ఆదాయం ఉన్న మహిళ తన తల్లిదండ్రులతో ఉండటం అరుదని ఓ ఉదాహరణగా వివరించారు. ఈ ప్రశ్నకు ఐశ్వర్యరాయ్ తనదైన‌ శైలిలో స్పందించారు. నటిగా వృత్తి రీత్యా ఎప్పుడూ షూటింగ్‌లు, ప్రయాణాలు అంటూ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిపారు. `మా ఉద్యోగం వల్ల మేము కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడెప్పుడో ఒకరోజు అంతా కలిసి డిన్నర్ చేసే అవకాశం దొరుకుతుంది. అలాంటి అరుదైన క్షణాలను మేము ఎంతో విలువైనవిగా భావిస్తాము` అన్నారు.

అనంతరం సంభాషణ `స్వేచ్ఛ` అనే అంశం వైపు మళ్లినప్పుడు లెటర్‌మన్ ఐష్ ను `మీరు స్వతంత్రమైన మహిళా? అని ప్రశ్నించారు. దానికి ఐశ్వర్యరాయ్ అవునని స‌మాధానం ఇచ్చారు. `ఇంటి నుంచి, తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్లి వేరుగా నివసించడమే స్వేచ్ఛకు నిదర్శనం అని నేను భావించను` అన్నారు. ఐష్ చేసిన వ్యాఖ్యలు భారతీయ కుటుంబ వ్యవస్థ విలువలను, అమెరికన్ జీవనశైలికి ఉన్న వ్యత్యాసాన్ని ఎంతో చక్కగా ప్రతి బింబిస్తున్నాయి.

మణిరత్నం దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ తమిళ చిత్రం `ఇరువర్` సినీ రంగానికి పరిచయమైన ఐశ్వర్యరాయ్ ఆ బాలీవుడ్‌లో ఎలా ఎదిగారున్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అటుపై హాలీవుడ్ లోనూ త‌న‌దైన ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేసారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ మెరుపులతో పాటు `బ్రైడ్ అండ్ ప్రిజుడీస్`, `ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్`, `ది పింక్ పాంథర్ 2` వంటి అంతర్జాతీయ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

ఇక ఐష్ సినిమాల విషయానికొస్తే చివరగా మణిరత్నం తెరకెక్కించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్ 2` లో వెండితెరపై కనిపించారు. ఆ త‌ర్వాత కొత్త సినిమాలేవి క‌మ‌ట్ అవ్వ‌లేదు. వాస్త‌వానికి ఐశ్వ‌ర్యారాయ్ వివాహం అయిన నాటి నుంచి సినిమాలు త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. అరుదుగా బాగా న‌చ్చిన క‌థ‌ల్లో న‌టించ‌డం త‌ప్ప కుటుంబ జీవితానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

Tags:    

Similar News