2026: మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ మూవీస్ ఇవే!

కొత్త ఏడాది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మూవీ లవర్స్ నూతన సంవత్సరంలో వచ్చే చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.;

Update: 2025-12-30 04:30 GMT

కొత్త ఏడాది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మూవీ లవర్స్ నూతన సంవత్సరంలో వచ్చే చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ , హిందీ చిత్రాల కోసమే కాకుండా హాలీవుడ్ మూవీల కోసం కూడా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మరి వచ్చే ఏడాది ఇండియన్ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతున్న మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అవెంజర్స్ : డూమ్స్ డే.. మార్వెల్ కామిక్స్ సూపర్ హీరో టీం అవెంజర్స్ ఆధారంగా రాబోయే అమెరికన్ సూపర్ హీరోస్ , ఏజీబీవో నిర్మించి, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసిన చిత్రం 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్. ఆ తర్వాత అవెంజర్స్ ఫిలిం సిరీస్ లో రాబోతున్న ఐదవ భాగం అవెంజర్స్ డూమ్స్ డే. ఒక రకంగా చెప్పాలి అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో 39వ చిత్రంగా రాబోతోంది. ఆంటోనీ , జోరస్సో దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ 18న విడుదల కాబోతోంది.

స్పైడర్ మాన్: బ్రాండ్ న్యూ డే.. స్పైడర్ మాన్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రతిబింబిస్తూ రాబోయే ఎపిసోడ్ ను చాలా అద్భుతంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవ ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

డూన్ : పార్ట్ 3.. డెనిస్ విల్లేనెయువ్.. ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వినోదాన్ని పంచగా.. ఇప్పుడు లోతైన రాజకీయ, తాత్విక ఆలోచనలతో పెద్ద ఎత్తున విజువల్స్ ను మిళితం చేస్తూ చివరి పార్ట్ ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ది ఒడిస్సి.. పురాతన ఇతిహాసాలను ఆధునిక పద్ధతులలో తిరిగి రూపొందిస్తే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రాలు , వెబ్ సిరీస్ లతోపాటు వచ్చే ఏడాది ది సూపర్ మారియో గెలాక్సీ, గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్, 28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్, ది రిప్, సెండ్ హెల్ప్, గోట్, వూథరింగ్ హైట్స్ ఇలా మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Tags:    

Similar News