ఆది సాయి కుమార్ 'శంబాల'.. సందీప్ కిషన్ బంపరాఫర్..

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ రీసెంట్ గా శంబాల: ఏ మిస్టిక్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-30 07:03 GMT

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ రీసెంట్ గా శంబాల: ఏ మిస్టిక్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా.. క్రిస్మస్ ఫెస్టివల్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా రిలీజైంది. ఇప్పుడు మంచి టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

ముఖ్యంగా ఆది కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచిన శంబాల మూవీ.. ఆయనకు అన్ని విధాలుగా బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. మూవీ చూసిన వారంతా సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తున్నారు. ఆది తన యాక్టింగ్ తో అదరగొట్టేశారని చెబుతున్నారు. ఓవరాల్ గా మూవీ బాగుందని కూడా అంటున్నారు.

దీంతో ఆది సాయి కుమార్ తో పాటు శంబాల టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉంది. పోస్ట్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. అదే సమయంలో శంబాలను మరింత ప్రమోట్ చేసేందుకు మరో టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్ ముందుకొచ్చారు. మూవీ చూసే వారి కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.

శంబాల సినిమా చూసిన ఆడియన్స్ కడుపునిండా భోజనం చేసేందుకు మంచి అవకాశం ఇచ్చారు సందీప్ కిషన్. మూవీ టికెట్ చూపించిన వారికి తెలుగు రాష్ట్రాల్లోని తనకు సంబంధించిన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో బిల్లుపై 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రేక్ష‌కులు ఫిజికల్ టికెట్ లేదా ఆన్‌లైన్ బుకింగ్ స్క్రీన్ షాట్ చూపించి అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు.

అది కూడా ఒకట్రెండు రోజులు కాదు.. శంబాల మూవీ థియేటర్స్ లో ఉన్నన్ని రోజులు కూడా ఆఫర్ ఉంటుందని అనౌన్స్ చేశారు సందీప్ కిషన్. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇప్పటికే అందరినీ అలరిస్తున్న సినిమా కోసం సందీప్ తీసుకున్న నిర్ణయంపై సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక మూవీ విషయానికొస్తే.. 1980 స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన శంబాలలో ఆది సాయి కుమార్ విక్రమ్ అనే జియో-సైంటిస్ట్‌ గా నటించారు. ఆయన సరసన అర్చన అయ్యర్ యాక్ట్ చేశారు. దేవి రోల్ లో కనిపించారు. వారితో పాటు సినిమాలో స్వాసిక, రవివర్మ, మధునందన్, హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

సైన్స్, దైవత్వం మధ్య జరిగిన పోరాటంగా సాగిన సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు రూపొందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరి మీరు శంబాల మూవీ చూశారా? సందీప్ కిషన్ ఆఫర్ ను వినియోగించుకోండి మరి.





Tags:    

Similar News