సమంత రాంగ్ స్టెప్..!

Update: 2023-04-14 12:00 GMT
స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ లో ఫస్ట్ టైం ఒక ప్రయోగాత్మక సినిమా చేసింది. అదే శాకుంతలం. ఇన్నాళ్లు తన మార్క్ నటనతో మెప్పిస్తూ వచ్చిన సమంత మొదటిసారి మైథలాజికల్ మూవీలో నటించింది.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఇప్పటికే స్పెషల్ షోస్, ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు. శాకుంతలం సినిమా మొదటి నుంచి ఎక్కడో తేడా కొడుతోంది అన్నట్టుగా అనిపించింది.

గుణశేఖర్ మంచి దర్శకుడే కానీ ఆయన శాకుంతలం తెరకెక్కించిన తీరు మాత్రం నిరాశపరచింది. అందరికీ తెలిసిన కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు.

ఈ సినిమాతో సమంత నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని భావించగా అసలు సినిమా ఎందుకు ఓకే చేసింది అనేలా సినిమా ఉంది. శాకుంతలం సినిమా సమంత ఒక రాంగ్ సెలక్షన్ అని అంటున్నారు.

శాకుంతలం సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడే అంతగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది. రిలీజ్ ముందు వారం నుంచి ప్రమోషన్స్ చేస్తున్నా సినిమాలో విషయం లేకపోతే ఎన్ని ప్రమోషన్స్ చేసినా సరే లాభం లేదు కాబట్టి శాకుంతలం సినిమా ఒక విఫల ప్రయత్నమని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో గుణశేఖర్ మరి కాస్త బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకాస్త దృష్టి పెట్టినట్టు ఉంటే బాగుండేదని చెబుతున్నారు.

ఓ బేబీ, యశోద సినిమాలతో తను లీడ్ రోల్ చేసిన సినిమాలతో కూడా సక్సెస్ అందుకున్న సమంత శాకుంతలం తో అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని అనుకున్నారు కానీ ఈ సినిమాకు అది వర్క్ అవుట్ అయ్యేలా లేదు. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తుంది.

Similar News