ట్రెడిషనల్ లుక్ లో రౌడీ హీరో.. పంచెకట్టులో మీసం మెలేస్తూ!
అలా తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా సంక్రాంతి సెలబ్రేషన్స్ ను తన కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా భారీ పాపులర్ కి సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి చివరిలో అందరినీ ఏడిపించారు. అలా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని రౌడీ హీరోగా బిరుదు సొంతం చేసుకున్నారు.
అలా తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా సంక్రాంతి సెలబ్రేషన్స్ ను తన కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోవడంతో అందులో చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా పంచె కట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన విజయ్ దేవరకొండ.. మీసాలు మెలేస్తూ ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటోలలో సాంప్రదాయ దుస్తుల్లో మెలేసిన మీసాలు.. కళ్లద్దాలతో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలను విలేజ్లో జరుపుకుందామని తన తల్లికి ప్రామిస్ చేశానని కూడా తెలిపారు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి లేడీ అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.
విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ప్రస్తుతం రౌడీ జనార్దన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ పర్ఫామెన్స్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు విజయ్ దేవరకొండ.
ఈయన వ్యక్తిగత విషయానికొస్తే.. గీతాగోవిందం సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నతో ప్రేమలో పడ్డారని.. అప్పటినుంచి వార్తలు వినిపించాయి. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ సమయంలో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని.. డేటింగ్ కూడా చేసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ దీనిని వీరు ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లడం, పార్టీలు చేసుకోవడం.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో జరిగే ప్రతి పండుగలో రష్మిక సందడి చేయడం.. వారి ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడం లాంటివి చేస్తూనే ఉంది. ఇక ఎట్టకేలకు రూమర్స్ ను నిజం చేస్తూ గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. మరి ఈ ఏడాదైనా ఈ రూమర్డ్ జంట వైవాహిక బంధంలోకి అడుగు పెడతారేమో చూడాలి.