బ్రాండ్స్‌లో దూసుకెళుతున్న స‌మంత‌

సమంత ప్రస్తుతం కేవలం నటిగానే కాకుండా ఒక సీరియస్ బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.;

Update: 2026-01-16 04:32 GMT

సమంత ప్రస్తుతం కేవలం నటిగానే కాకుండా ఒక సీరియస్ బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందాల న‌టి రాజ్ నిడిమోరును పెళ్లాడిన త‌ర్వాత మ‌రింత ఎన‌ర్జిటిక్ గా వ్య‌వ‌స్థాప‌క రంగంలో దూసుకుపోతోంది. సామ్ కొన్ని పాపుల‌ర్ బ్రాండ్ల‌కు మ‌ద్ధ‌తుదారుగా ఉన్నారు. తన బ్రాండ్ల విషయంలో సామ్ తాజా వ్యాఖ్యలు ఆస‌క్తిని క‌లిగించాయి. సామ్ అనుసరిస్తున్న విధానాలలో ప్రధానంగా ఆరోగ్యం, పారదర్శకత, బాధ్యతాయుతమైన జీవనశైలి ముఖ్య‌మైన‌వి.




 


సమంత తన బ్రాండ్స్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ధోర‌ణుల‌ గురించి చాలా చెప్పుకోవాలి. ఇటీవ‌ల `మైల్ క‌లెక్టివ్` అనే కొత్త యాక్టివ్ బ్రాండ్ ని సామ్ ప్రారంభించారు. దీని గురించి ఏం చెప్పారంటే, కదలిక అనేది కేవలం ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాదు.. అది రోజంతా మనలో ఉండే బ్యాలెన్స్ కు, ప్రశాంతతకు సంబంధించింది. ఈబ్రాండ్ దుస్తులు చాలా తేలికగా, మేఘంలా అనిపిస్తాయి. ఇవి కేవలం వర్కౌట్స్ కోసం మాత్రమే కాదు, రోజంతా వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. భారతీయుల‌ శరీరాకృతికి, వాతావరణానికి సరిపోయేలా ఈ బ్రాండ్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు.




 


ఈ బ్రాండ్‌ను నిర్మించడంలో గత పన్నెండు నెలలు ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నాయ‌ని, పునాది వేయడానికి శ్ర‌మించాన‌ని స‌మంత తెలిపారు. భయం, సొంత డౌట్లు ఆస‌రాగా దీనిని అభివృద్ధి చేసామ‌ని సామ్ తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం, నేను ప్రతిదాన్ని ప్రశ్నించాను... నేను ఎవరు, నేను ఏమి అందించాను? నన్ను భిన్నంగా చేసింది ఏమిటి? దానికి నేడు ప్ర‌తిదీ స్పష్టంగా ఉంది. నేను నా సొంత‌ స్థితికి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇది ఒక మలుపులా అనిపిస్తుంది. నన్ను నేను విశ్వసించడం, నా నిర్ణయాలకు కట్టుబడి ఉండటం.. మెరుగైన జీవనం వైపు మనల్ని నడిపించే ఉత్పత్తులను సృష్టించడం. మునుముందు ఏదైనా కొత్తదాన్ని ప్రారంభించడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను... కొంచెం భావోద్వేగానికి గురవుతున్నాను... అని స‌మంత ఎమోష‌న‌ల్ అయ్యారు.

తన పాత క్లాతింగ్ బ్రాండ్ `సాకీ`ని అప్‌డేట్ చేస్తూ, ప్రీమియం విభాగంలో `ట్రూలీ స్మా` అనే డిజిటల్ లేబుల్‌ను కూడా స‌మంత‌ నడుపుతున్నారు. ఇది తన సొంత స్టైల్‌ను ప్రతిబింబించే బ్రాండ్ అని, ట్రెండ్స్ వెనుక పరుగెత్తకుండా క్లాసీగా ఉండాలని కోరుకుంటున్న‌ట్టు సామ్ తెలిపారు.

సీక్రెట్ ఆల్కెమిస్ట్ అనే వెల్ నెస్, సుగంధ ద్ర‌వ్యాల బ్రాండ్ లోను స‌మంత పెట్టుబ‌డులు పెట్టారు. సమంత సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఈ వెల్నెస్ - సుగంధ ద్రవ్యాల బ్రాండ్ ఇటీవల 30ల‌క్ష‌ల‌ డాల‌ర్ల‌ నిధులను సేకరించింది. ఈ బ్రాండ్ ఎదుగుతున్న తీరు త‌న‌కు చాలా సంతోషాన్నిస్తోంద‌ని అన్నారు. పారదర్శకత, నాణ్యమైన పదార్థాలతో ఉత్పత్తులను రూపొందించడమే మా లక్ష్యం. ఆరోగ్యాన్ని దెబ్బతీయని పద్ధతిలో లగ్జరీని అందించడమే నా ఉద్దేశ్యం అని స‌మంత తెలిపారు.

15 బ్రాండ్లు వ‌దులుకున్నాను:

సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను దాదాపు 15 పెద్ద బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను తిరస్కరించినట్లు వెల్లడించారు. దీనివల్ల ఆమె కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకున్నారు. గతంలో సక్సెస్ అంటే ఎన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నామనేది కొలమానం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది. ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే ముందు నేను ముగ్గురు డాక్టర్ల సలహా తీసుకుంటాను. ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే ఉత్పత్తులను నేను ఇకపై ప్రమోట్ చేయను... అని తెలిపారు. తన 20 ఏళ్ళ వయసులో చేసిన కొన్ని ప్రకటనల విషయంలో తన ప్రస్తుత వెర్షన్ నాటి పాత వెర్షన్‌కు క్షమాపణలు చెప్పాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.




Tags:    

Similar News