ధనుష్, మృణాల్.. ఆ రోజేనా? నిజమెంత?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు స్ప్రెడ్ అవుతున్న విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు స్ప్రెడ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మృణాల్ పలుమార్లు ఊహాగానాలను ఖండించినా.. ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వారిద్దరి డేటింగ్ టాపిక్ పై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకుంటారనే పోస్టులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. వారిద్దరి పెళ్లికి ఇరువురి సన్నిహితులు, స్నేహితులు మాత్రం అటెండ్ అవుతారనే ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి. చాలా కొద్ది మంది సమక్షంలోనే వీళ్లు వివాహమాడతారని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న పెళ్లి వార్తపై అటు ధనుష్ గానీ, ఇటు మృణాల్ ఠాకూర్ గానీ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. దీంతో అందులో నిజమెంత అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. రూమర్స్ అని వదిలేశారో.. లేక వెనకాల ఏదో జరుగుతుందా అనేది వారికి మాత్రమే తెలియాలి. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ పెళ్లి విషయమే ట్రెండింగ్ టాపిక్.
కాగా.. కొంతకాలంగా వారిద్దరూ క్లోజ్ గానే ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకరి మూవీ ఈవెంట్ కు మరొకరు అటెండ్ కావడం, ఇన్ స్టాలో ధనుష్ సిస్టర్స్, మృణాల్ ఒకరి అకౌంట్ ను మరొకరు ఫాలో కావడం.. ఇలాంటి కొన్ని పరిణామాల వల్ల ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఆగస్టులో మృణాల్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ కు ధనుష్ అటెండ్ అయ్యారు.
అంతకుముందే ధనుష్ సినిమా తేరే ఇష్క్ మే ర్యాప్ పార్టీలో మృణాల్ ఠాకూర్ కనిపించడంతో ఊహాగానాలకు దారితీసింది. ఆ తర్వాత ఆమె ధనుష్ సిస్టర్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం కూడా గాసిప్స్ కు మరింత బలాన్నిచ్చింది. ఆ తర్వాత ధనుష్ పోస్టుకు మృణాల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని అంతా మాట్లాడుకుంటున్నారు.
అయితే గతంలో ధనుష్ కు వివాహం జరిగింది. ఆయన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ జంట 2024లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తర్వాతే ధనుష్, మృణాల్ పరిచయమయ్యారని, ప్రేమలో పడ్డారని కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఏదేమైనా నిజమెంత అనేది వారికే తెలియాలి.