ఎల్లమ్మ.. టాలీవుడ్ కాంతార అవుతుందా..?

బలగం సినిమాతో డైరెక్టర్ గా తన తొలి ప్రయత్నమే సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.;

Update: 2026-01-16 05:33 GMT

బలగం సినిమాతో డైరెక్టర్ గా తన తొలి ప్రయత్నమే సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక తన రెండో సినిమాగా ఎల్లమ్మ అనౌన్స్ చేసినప్పటి నుంచి బజ్ క్రియేట్ అయ్యింది. వేణు చేస్తున్న ఎల్లమ్మ సినిమాపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఐతే ఫైనల్ గా ఎల్లమ్మ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి సస్పెన్స్ కి తెరలేపారు. ఎల్లమ్మ టైటిల్ తో వేణు ఎలాంటి కథ చెబుతున్నాడు అన్నది చెప్పేలా ఒక గ్లింప్స్ తో హై ఇచ్చాడు.

రాక్ స్టార్ DSP ఎల్లమ్మ..

డివోషనల్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ అవబోతున్నాడు. రాక్ స్టార్ గా DSP తన సంగీతంతో ఆడియన్స్ ని అలరిస్తుండగా ఎల్లమ్మతో తన యాక్టింగ్ డిబట్ ని చేస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఎల్లమ్మ గ్లింప్స్ లో దేవి మ్యూజిక్ కూడా దుమ్ము దులిపేసింది. అలా గజ్జెలు కట్టిన కాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చిన ఆ చిన్న క్లిప్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంతేకాదు మేక జడ్తా ఇవ్వడం.. ఆకాశంలో అమ్మ వారి రూపం కనిపించడం ఇలాంటివి అన్నీ కూడా ఇన్ స్టంట్ గా ఎక్కేశాయి.

ఎల్లమ్మ గ్లింప్స్ తోనే సూపర్ హై ఇచ్చారు. ఐతే ఈ టీజర్ చూసిన వాళ్లంతా కూడా ఇది టాలీవుడ్ కాంతారా అవుతుందని అనుకుంటున్నారు. గ్లింప్స్ చూసిన కొందరు నెటిజన్లు అదే విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాంతారా సినిమా కూడా ఒక డివోషనల్ కథతో రిషబ్ శెట్టి యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఎల్లమ్మ కథ ఏంటన్నది తెలియదు కానీ ఈ టీజర్ చూసిన వాళ్లైతే తప్పకుండా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది.

నేషనల్ వైడ్ రిలీజ్..

ఐతే ఈ సినిమాలో హీరో దేవి శ్రీ ప్రసాద్ అన్నది రివీలైంది. ఇక నెక్స్ట్ హీరోయిన్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎల్లమ్మ సినిమాను దేవి శ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాక ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యింది. నేషనల్ వైడ్ రిలీజ్ కాబట్టి సినిమాలో హీరోయిన్ కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్లనే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎల్లమ్మ సినిమా టీజర్ ఆడియన్స్ ని ఖుషి చేసింది. ఐతే గ్లింప్స్ తోనే ఈ రేంజ్ హై ఇచ్చాడంటే ఇక నెక్స్ట్ రాబోతున్న ప్రమోషనల్ కంటెంట్ ఇంకా సినిమా ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఎల్లమ్మ సినిమాకు వేణు రెండేళ్లుగా పనిచేశాడు. ఐతే ఫస్ట్ ఇంపాక్ట్ గా వచ్చిన గ్లింప్స్ తోనే సినిమాపై ఒక సూపర్ బజ్ తెచ్చాడు. ఐతే ఈ సినిమా టాలీవుడ్ కాంతారా అవుతుందా లేదా అన్నది చూడాలి. వేణు యెల్దండి ప్లాన్ చూస్తుంటే ఈసారి బలగం ని మించి హిట్ ఇచ్చేలా ఉన్నారు.

Tags:    

Similar News