సాహో బ్యూటీ కొత్త యాపారం
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా అడుగు పెట్టినా కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా శ్రద్దా కపూర్ దూసుకు పోతుంది. బాలీవుడ్ లో ఈమె చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇక ఈమె చేస్తున్న బాలీవుడ్ సినిమాలతో భారీ ఎత్తున పారితోషికంను అందుకుంటూ ఉంది. తాజాగా ఈమె చేస్తున్న సినిమాల జాబితాతో పాటు ఈమె నటిస్తున్న కమర్షియల్స్ మరియు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కంపెనీల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూనే ఉంది.
ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్ తాజాగా బ్యాగ్ ఇట్ అనే ఆన్ లైన్ స్టోర్ కమ్ బ్యాగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది. ఈ కొత్త సంస్థలో ఆమెకు కూడా భాగ స్వామ్యం ఉందని బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈమద్య కాలంలో చిన్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడం వల్ల కంపెనీలో షేర్ ను తీసుకుంటున్నారు. ధోని అలా ఎన్నో కంపెనీలను సొంతం చేసుకున్నారు అంటారు. అలాగే శ్రద్దా కపూర్ కూడా ఈ బ్యాగ్ ఇట్ లో భాగస్వామి అయ్యిందని అంటున్నారు.
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులకు సాహో సినిమా తో పరిచయం అయ్యింది. ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ ప్రభాస్ తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ఈమె చేతి నిండా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో కూడా బిజీగా ఉంది. ఈ సమయంలో కూడా ఇంకా కొన్ని సినిమాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి.