• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ ఆచార్యలో మరో...

మెగాస్టార్ ఆచార్యలో మరో స్టార్ హీరోనా..??

By - Tupaki Desk
Update: 2020-07-14 09:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. మెగాస్టార్ కెరీర్ లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో, మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థానంలోకి చేరాడు. తన ప్రతి సినిమాలో ఏదొక సందేశంతో మాస్-క్లాస్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తూనే ఉన్నాడు కొరటాల. ఇటీవలే 'సైరా నరసింహరెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ 'ఆచార్య'తో త్వరలో సందడి చేయనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆచార్య సినిమాలో విలన్ పాత్రకు తమిళ యాక్టర్ రహమాన్ సెలక్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందట.

ఆ పాత్ర కోసం హీరో రానాతో సంప్రదింపులు జరుగుతున్నాయట. అయితే తక్కువ నిడివి ఉన్న కూడా పాత్రకు ప్రాధాన్యత ఉందని రానా కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర దాదాపుగా 30 నిముషాల వరకు ఉండబోతుందట. అంతేగాక ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ క్యారెక్టర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రాంచరణ్ పాత్రకి ఓ హీరోయిన్ ఉంటుందట. ఇంకా మెగా డాటర్ నిహారిక ఓ పాత్రలో మెరవనుంది. ఇదివరకే సైరా నరసింహ రెడ్డి సినిమాలో కనిపించింది నిహారిక. అంతేగాక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చిత్రబృందం రాంచరణ్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడిందట. మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Tags:    
  • Acharya 
  • Ram charan 
  • Chiranjeevi 
  • koratala siva 
  • Rana 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS