ఆ పెళ్లిలో డార్లింగ్ పెళ్లి గోల‌

Update: 2018-12-30 04:43 GMT
శుభ‌మా అని పెళ్లికి వెళితే... ఆ పెళ్లిలో క‌ళ్ల‌న్నీ ఈ జంట‌పైనే!?  పెళ్లి సంగ‌తి గాలికొదిలేసి అతిధులంతా వేరొక జంట‌ పెళ్లి గోల‌లో త‌లమున‌క‌ల‌య్యారు.. అస‌లై మాయ‌దారి జ‌నం... ఆపై గుస‌గుస‌ల సంద‌డి.. అహో! పెళ్లంతా ఇదే ముచ్చ‌ట‌. ఇదో వింతైన ప‌రిస్థితి. వీనుల విందైన ప‌సందైన పెళ్లి వేడుక‌లో అస‌లు ఈ కొత్త‌ గోలేంటి? అని కంగారు ప‌డ‌న‌వ‌స‌రం లేదు. ఇంత‌కీ ఈ తంతు ఏ పెళ్లిలో.. జ‌నాల కంట‌ ప‌డిన ఆ వేరొక‌ జంట ఎవ‌రు? అంటే.. వివ‌రంలోకి వెళ్లాలి.

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ వివాహ మ‌హోత్స‌వం జైపూర్ లో అంగ‌రంగ వైభ‌వంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడురోజుల‌ పెళ్లి వేడుక‌లో టాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ స్టార్లు సంద‌డి చేస్తున్నారు. అందులో డార్లింగ్ ప్ర‌భాస్ సంద‌డిని జ‌నం ఎక్కువ ప‌రిశీలిస్తున్నారు. అస‌లే డార్లింగ్.. పైగా స్వీటీతో క‌లిసి ఈ పెళ్లిలో దిగ‌డంతో ఒక‌టే ర‌చ్చ‌వుతోంది. మీడియా అటెన్ష‌న్ మొత్తం ఈ జంట‌పైనే. దీంతో కార్తికేయ- పూజా ప్ర‌సాద్ పెళ్లి గురించి కంటే ప్ర‌భాస్ రాజు- అనుష్క శెట్టి పెళ్లెప్పుడు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ  వెన్యూ ద‌గ్గ‌ర‌ సాగింద‌ట‌. పెళ్లికని వ‌చ్చి ఇలా బుక్క‌య్యారేంటో! అంటూ అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. డార్లింగ్ అభిమానుల్లో - ఫిలింస‌ర్కిల్స్ లో వేడి పెంచుతోంది ఈ ప్ర‌చారం. అటు ఉత్త‌రాది మీడియా సైతం చూడ ముచ్చ‌టైన  జంట అంటూ ప్ర‌భాస్- అనుష్కనే ఎక్కువ ఫోక‌స్ చేసేస్తోందిట‌.

కార్తికేయ మూడు రోజుల పెళ్లికి తొలిరోజే ఈ జంట కూడా అటెండ్ అయ్యారు. విడివిడిగా వ‌చ్చారో - క‌లిసే ప‌య‌న‌మ‌య్యారో కానీ - వెన్యూ ద‌గ్గ‌ర బోలెడంత సంద‌డి చేశారు. పెళ్ళిలో ప్రభాస్- స్వీటీ ఇద్దరు అందరి దృష్టిని ఆకర్షించారు. జంటగానే అక్కడికి వచ్చిన అతిధుల్ని రిసీవ్ చేసుకోవ‌డం.. పెళ్లి పనుల్లో రాజమౌళికి సహాయం చేస్తుండటం జ‌నం కంట ప‌డింది. ప‌నిలో ప‌నిగా మధ్య మధ్యలో ఆ ఇద్ద‌రూ కబుర్లాడుకోవటం ప‌లు అనుమానాలకు తావిచ్చిందట‌. రాజ‌స్థానీ స్టైల్ లో సంగీత్ కార్య‌క్ర‌మంలో సంగీతానికి ఈ జోడీ డ్యాన్సులు చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మొన్ననే కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో అస‌లు పెళ్లి ఇప్ప‌ట్లో లేనేలేద‌ని క‌రాఖండిగా చెప్పేసిన డార్లింగ్ ఈలోగానే ఇలా చేస్తున్నాడేం?  ఇంత‌లోనే మ‌న‌సు మార్చుకున్నాడా? అస‌లేం జ‌రుగుతోంది?   వ్వాట్ హ్యాపెనింగ్ డార్లింగ్?
   

Tags:    

Similar News