ఆ టైటిల్ వలనే పవన్ 'బాషా' రూమర్లా?

Update: 2017-09-07 12:54 GMT
ఇంతకీ పవన్ కళ్యాణ్‌ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పేరును 'అజ్ఞాతవాసి' అని నిజంగానే పెడుతున్నారా లేదా? ఇప్పుడు ఇదే కనుక పాయింట్ అయితే.. దానిపై క్లారిటీ దసరాకు వస్తుంది కాని.. అసలు ఈ సినిమాలో కంటెంట్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు నభూతో నభవిష్యత్ అన్న చందాన ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

ఒకవేళ జనసేన నాయకుడు నిజంగానే రాజకీయాల్లో బిజీ అయిపోతే.. టెక్నికల్ గా ఇదే ఆయన ఆఖరి సినిమా. అందుకే ఈ సినిమాలో భారీ రేంజు హీరోయిజం చూపించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడట. ఈ సినిమాలో అచ్చం 'బాషా' సినిమా తరహాలో పవన్ కళ్యాణ్‌ కు ఒక ఫ్లాష్‌ బ్యాక్ ఉంటుందట. అయితే ఎప్పుడైతే తను ఎవరో చెబుతూ ఫ్లాష్‌ బ్యాక్ రివీల్ చేస్తాడో.. అప్పుడు వచ్చే సీన్లన్నీ కూడా అభిమానులకు పండగని తెస్తాయి అంటున్నారు. కాని ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియదు.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్‌ అండ్ త్రివిక్రమ్ సినిమా పేరు 'అజ్ఞాతవాసి' అనే రూమర్లు వచ్చాయో.. ఆ పేరును చూసి నిజంగానే ఆయన అజ్ఞాతంలో ఉంటాడు.. తరువాత 'బాషా' తరహాలో బయటకు వచ్చేస్తాడు అంటూ కథలు అల్లడం మొదలెట్టేశారు జనాలు. ఇవన్నీ మరి నిజంగానే కథల లేకపోతే మనం రూమర్లు అనుకుంటున్న నిజాలో తెలియాలంటే.. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News