స్టార్‌ హీరో కొడుకుపై వస్తున్నవన్నీ పుకార్

Update: 2020-03-11 03:30 GMT
తమిళంతో పాటు తెలుగు లో కూడా స్టార్‌ ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న చియాన్‌ విక్రమ్‌ తాను హీరోగా చేస్తూనే కొడుకు ధృవ్‌ ను హీరోగా పరిచయం చేసిన విషయం తెల్సిందే. తెలుగు అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ఆధిత్య వర్మతో ధృవ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాకే చాలా కష్టపడ్డ ఈ కుర్రాడు రెండవ సినిమాను ఇప్పటి వరకు ప్రకటించక పోవడం తో అనేక పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా తమిళ మీడియాలో ధృవ్‌ మళ్లీ చదువుకునేందుకు విదేశాలకు వెళ్లబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

ఆధిత్య వర్మ సినిమాకు ముందు ధృవ్‌ విదేశాల్లో చదువుతుండేవాడట. చదువు పూర్తి కాకుండానే ఈ సినిమాను చేసేందుకు వచ్చిన ఆధిత్య వర్మ మళ్లీ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసేందుకు విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం ధృవ్‌ రెండవ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కాని అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. ధృవ్‌ రెండవ సినిమాకు సంబంధించిన చర్చలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయట.
Read more!

ఆధిత్య వర్మ చిత్రంతో నటుడి గా మంచి పేరు దక్కించుకున్న ఈ యంగ్‌ స్టర్‌ రెండవ సినిమాను సెల్వరాజ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్‌ తో సెల్వరాజ్‌ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ధృవ్‌ తో ఒక సినిమాను చేసేందుకు దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే కథను చెప్పి విక్రమ్‌ ను ఒప్పించాడట. సెల్వరాజ్‌ మాత్రమే కాకుండా మరో దర్శకుడితో కూడా సినిమాను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ధృవ్‌ సినిమాలను కంటిన్యూ చేస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది.
Tags:    

Similar News