• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆల్మోస్ట్ రికవర్.. త్వరలో...

ఆల్మోస్ట్ రికవర్.. త్వరలో షూటింగ్!

By - Tupaki Desk
Update: 2019-05-06 11:42 GMT
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' ఇప్పుడు ఇండియా లో సెట్స్ మీద ఉన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. అయితే షూటింగ్ జోరుగా సాగుతుందనుకునే సమయంలో హీరోలు రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ గాయాల బారిన పడడంతో షూటింగ్ కు అర్థాంతరంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో చరణ్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ ఉండగా కాలి మడమకు గాయం అయింది.  రెండువారాల తర్వాత ఎన్టీఆర్ మణికట్టుకు గాయం కావడంతో షూటింగ్ కు దూరమయ్యాడు.  

ఈ సంఘటనలు అటు చరణ్ అభిమానులలోనూ ఇటు తారక్ అభిమానుల్లోనూ అందోళనను రేకెత్తించాయి.  అయితే తాజా సమాచారం ఏంటంటే ఇద్దరు స్టార్లు తమ గాయాల నుండి దాదాపుగా కోలుకున్నారని.. త్వరలో 'RRR' షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారట.  దీంతో వచ్చే ఏడాది జులై 30 న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న టీమ్ కు రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్నారు.  బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. అలియా భట్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.  మలయాళీ బ్యూటీ నిత్యా మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
    

Tags:    
  • RRR Movie 
  • Ram Charan 
  • Jr NTR 
  • Rajamouli 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS