• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జక్కన్న హీరోల్లో చరణ్‌ కు...

జక్కన్న హీరోల్లో చరణ్‌ కు మాత్రమే ఈ వెసులుబాటు

By - Tupaki Desk
Update: 2021-06-23 08:30 GMT
రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే పక్కా సూపర్‌ హిట్‌.. అలాగే ఆ హీరో కెరీర్‌ ఆల్ టైమ్ రికార్డ్‌ కూడా ఖాయం. జక్కన్న దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హీరోల ట్రాక్ రికార్డు అద్బుతం. ఆయన తో సినిమా అంటే ప్రతి ఒక్క హీరో ఏళ్లకు ఏళ్లు డేట్లు ఇచ్చేసి కూర్చుంటారు. అలాంటి జక్కన్న సినిమా కమిట్‌ అయిన సమయంలోనే హీరోలతో తన సినిమా పూర్తి అయ్యే వరకు ఎప్పుడు అంటే అప్పుడు అందుబాటులో ఉండాలి.. వేరే సినిమాలకు కమిట్‌ అవ్వకూడదు అనే ఒప్పందం ఉంటుంది. దాని ప్రకారమే రాజమౌళికి డేట్లు ఇచ్చి ఏళ్లకు ఎళ్లు హీరోలు ఆ సినిమా కోసం కష్టపడతారు. పడ్డ కష్టంకు పది రెట్ల ప్రతిఫలంను జక్కన్న తిరిగి ఇస్తాడు. అయితే చరణ్‌ విషయంలో మాత్రం ఈసారి జక్కన్న పాలసీ తప్పింది.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలో నటిస్తూనే రామ్‌ చరణ్‌ ఆచార్య సినిమా లో నటిస్తున్నాడు. ఆచార్య సినిమాలో రెండు నిమిషాలు.. అయిదు నిమిషాలు అన్నట్లుగా ఆయన పాత్ర ఉండటం లేదు. ఏకంగా సినిమా లో మరో హీరో అన్నట్లుగా ఎక్కువ సమయమే చరణ్‌ పాత్ర ఉంటుందట. సినిమాలో చరణ్‌ కు జోడీగా హీరోయిన్‌ పాటలు కూడా ఉన్నాయంటే ఆచార్యలో చరణ్ పాత్రను అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు ఆర్‌ ఆర్‌ ఆర్‌ షూటింగ్‌ లో పాల్గొంటూ గ్యాప్‌ దొరికితే ఆచార్యను చేస్తున్నాడు. కాని ఈసారి మాత్రం రెండు సినిమా లను ఒకేసారి చేయబోతున్నాడు.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటూనే మరో వైపు త్వరలో ప్రారంభం కాబోతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. ఒక్క రోజులో రెండు సినిమా ల షూటింగ్‌ ల్లో చరణ్‌ పాల్గొనబోతున్నాడట. వారం నుండి పది రోజుల్లో ఆచార్య షూట్‌ ను పూర్తి చేస్తారు. కనుక ఆ కొన్ని రోజుల పాటు కాస్త ఇబ్బంది అయినా చరణ్‌ అక్కడ ఇక్కడ దున్నేయబోతున్నాడట. జక్కన్న ఏ హీరో కు కూడా ఇలాంటి వెసులుబాటు దక్కలేదు. మొదటి సారి చరణ్‌ కు మాత్రమే ఇలాంటి అవకాశం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు.
Tags:    
  • Rrr Movie 
  • Hbd Jr Ntr 
  • Alia Bhatt 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS