#RRR ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇంకా సెట్స్ కి రారా?

Update: 2020-10-09 04:30 GMT
మాయ‌దారి మ‌హమ్మారీ అన్నిటికీ చెక్ పెట్టేసింది. బిజీ జీవితాల‌కు తూట్లు పొడిచింది. ఎప్పుడు సెట్స్ కెళ్లిపోదామా?  షూటింగులు పూర్తి చేద్దామా? అన్న ఆత్రం అంద‌రిలోనూ ఉంది. రామ్ చ‌ర‌ణ్ అయితే ఇన్నాళ్లు వేచి చూడ‌డం బోరింగ్ గా ఉంది. ఎప్పుడు షూట్ కి వెళ‌తానా? అంటూ ఇంత‌కుముందు ఆస‌క్తిని వ్య‌క్తం చేశారు. ఇంచుమించు ఎన్టీఆర్ ప‌రిస్థితి అదే. ఇన్ని నెల‌లు ఇంట్లోనే కూచుంటే ముందుకు సాగేదెలా? అన్న ఆవేద‌న నెల‌కొంది.

ఇక ఆర్.ఆర్.ఆర్ ని సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేయాల‌న్న రాజ‌మౌళి ప‌రిస్థితి అయితే చెప్పాల్సిన ప‌నే లేదు. అయితే మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఏడు నెల‌లుగా వేచి చూడాల్సిన ప‌రిస్థితి. ఎట్ట‌కేల‌కు అన్ లాక్ ప్ర‌క్రియ‌లో షూటింగుకి రెడీ చేశారు. రాజమౌళి తిరిగి సెట్స్ కి వెళ్లి కొన్ని రోజుల క్రితం  షూటింగు‌ను తిరిగి ప్రారంభించారు. షెడ్యూల్ పది రోజులు చేశార‌ట‌. ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేయడానికి టీజర్ ను కత్తిరించడానికి అవసరమైన భాగాలను మాత్ర‌మే చిత్రీకరించిన తర్వాత కొంత విరామం తీసుకున్నారు. కొమరం భీమ్ క్యారెక్టర్ ఇంట్రో టీజర్ దసరాకి విడుదల చేయాల‌న్న‌ది ప్లాన్. ప్రోమోకు అవసరమైన విజువల్స్ చిత్రీకరించాక గ్యాప్ ఇచ్చారు.

అన్ లాక్ 5.0 లో షూటింగుల‌కు మరింత వెసులుబాటు పెరిగింది. ఇక‌ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. కానీ ఆరంభం ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ సెట్స్ ‌లో ఉండరని తెలుస్తోంది. ప‌రిమిత‌ సిబ్బందితో షూటింగులు చేయాలంటే పని దినాల సంఖ్య పెంచాలి. కానీ రాజమౌళి సకాలంలో పూర్తి చేయాలనే నమ్మకంతో ఉన్నారట‌. ఇక ఇంత‌కుముందు ట్ర‌య‌ల్ షూట్ చేసిన రాజ‌మౌళి ఈసారి మాత్రం పూర్తి స్థాయి స‌రంజామాతో బ‌రిలో దిగాల్సి ఉంటుంది. చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ల‌తో షూటింగ్ చేయాలంటే నాన్ రిస్కీగా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో బ‌రిలో దిగాలి. దీనికోసం టీమ్ ప్లాన్ సిద్ధం చేసింద‌ట‌. 2021 వేస‌వి నాటికి మూవీని రెడీ చేయాల‌న్న క‌సి ఉన్నా అప్ప‌టికి అవుతుందా? అన్న‌ది చూడాలి. వీఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్ కి ఎంత స‌మ‌యం తీసుకుంటుంది? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News