దసరాకు 'ఆర్ఆర్ఆర్ - మైదాన్' ఢీ.. ఏ మూవీని తప్పిస్తారు??
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిస్టోరికల్ ఫిక్షన్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కథానాయకులుగా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. రెండు చారిత్రాత్మక జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ లు నటిస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వార్త ఇటీవల ప్రకటించేశారు మేకర్స్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి విడుదలైన మోషన్ పోస్టర్స్, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ ప్రోమోస్ సినిమా పై విపరీతంగా బజ్ క్రియేట్ చేసేసాయి. అందుకే ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది రాజమౌళి బృందం.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో అజయ్ దేవగన్.. ఎన్టీఆర్, రాంచరణ్ లకు గురువు పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా.. అజయ్ దేవగన్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మైదాన్ అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతుంది. బయోపిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నాడు అజయ్ దేవగన్. మైదాన్ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఆర్ఆర్ఆర్ విడుదలైన రెండు రోజులకే మైదాన్ రిలీజ్ అవ్వబోతుంది. కానీ ఈ రెండు భారీ సినిమాల బాక్సఫీస్ ఫైట్ నుండి ఏదోకటి తప్పుకుంటుందేమో చూడాలి. రెండు క్లాష్ అయితే మాత్రం రెండింటికి కలెక్షన్స్ విషయంలో నష్టం జరుగుతుందని టాక్. ఇక మైదాన్ సినిమా 1950-60 హైదరాబాద్ కోచ్, ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ - మైదాన్ ఢీకొంటాయేమో!