#RRR: అజయ్ పాత్ర.. ఇంట్రెస్టింగ్ టాక్

Update: 2019-10-12 05:49 GMT
భారీసినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం 'RRR' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' ఫ్రాంచైజీ సంచలన విజయం సాధించడంతో  రాజమౌళి క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది.  దేశవ్యాప్తంగా ప్రేక్షకులు రాజమౌళి నెక్స్ట్ ఫిలిం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుంటే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.  రీసెంట్ గా అజయ్ పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలోనూ.. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్నారు.  ఈ యోధుల జీవితాలను ప్రేరణగా తీసుకొని ఒక ఫిక్షనల్ కథను తయారు చేశారు.  ఈ ఇద్దరు యోధులకు శిక్షణనిచ్చే గురువు.. మార్గదర్శకుడి పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తారని సమాచారం. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ బ్రిటిష్ వారితో పోరాటం జరిపే రెండు సీక్వెన్సులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని.. అజయ్ పోరాటం స్వయంగా చూసి స్ఫూర్తి పొందిన తారక్.. చరణ్ లు బ్రిటిష్ వారిపై తమదైన శైలిలో పోరాడేందుకు సిద్ధం అవుతారని అంటున్నారు.

అజయ్ పాత్ర కల్పితమైనది అయినప్పటికీ సినిమాలో చాలా కీలకమైనదని..  స్క్రీన్ టైమ్ ఎక్కువ లేకపోయినా ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేస్తుందని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే నార్త్ ఆడియన్స్ కు ఒక ఫీస్ట్ లాంటిదే అనడంలో సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న తొలి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కాబట్టి పవర్ ఫుల్ పాత్రతో బాలీవుడ్ ఆడియన్స్ ను కట్టిపడేయడం ఖాయమే.
Tags:    

Similar News