• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'RRR' క్రేజీ అప్డేట్:...

'RRR' క్రేజీ అప్డేట్: రామరాజు - భీమ్ ల బైక్ రైడ్..!

By - Tupaki Desk
Update: 2021-06-29 06:06 GMT
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. 'బాహుబలి' వంటి విజువల్ వండర్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలసి నటిస్తుండంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారభమైంది. ఎన్టీఆర్ - చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా RRR చిత్ర బృందం షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోందని.. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని వెల్లడించారు.

అంతేకాదు ఇప్పటికే తారక్ - చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' 2 భాషలకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసారని.. మిగిలిన వాటిని కూడా త్వరలోనే ముగిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా RRR హీరోలు ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ బైక్ పై రైడ్ కు వెళ్తున్నారు. కొమురం భీమ్ నవ్వుతూ బైక్ డ్రైవ్ చేస్తుండగా.. వెనుక కూర్చున్న అల్లూరి సీతారామరాజు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో వారి అభిమానులు ఉబ్బితబ్బిబ్బులవుతున్నారు.

ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కూడా అదే రిలీజ్ డేట్ ని ప్రస్తావించడం గమనార్హం. జక్కన్న కాన్ఫిడెన్స్ చూస్తే ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని పరిస్థితులు అనుకూలిస్తే చెప్పిన సమయానికే తీసుకొచ్చేలా ఉన్నారు. కాగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో అలియా భట్ - ఓలివియా మోరిష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఇందులో అజయ్ దేవగన్ -  శ్రియ - సముద్రఖని తో పాటుగా పలువురు హాలీవుడ్ స్టార్స్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో విడుదలకానున్న 'ఆర్.ఆర్.ఆర్'.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Tags:    
  • Rrr Movie 
  • RRR Crazy Update 
  • RRR Latest Poster 
  • Alia Bhatt 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS