• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మడు అన్ని కోట్లు...

అమ్మడు అన్ని కోట్లు తీసుకున్నా.. మార్కెట్ పరంగా సినిమాకి బాగా ప్లస్ అయింది..!

By - Tupaki Desk
Update: 2021-06-12 08:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ దక్షిణాదిలో అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా 'సీత' పాత్రలో ఆమె కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన అలియా ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా కోసం ముద్దుగుమ్మ బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోడానికి తెలుగు కూడా నేర్చుకుంది. ఇక ఈ చిత్రం కోసం ఆలియా భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో చిన్న పాత్రలో అయినా నటించాలని ఆశపడిన అలియా.. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం కోసం తన రెమ్యూనరేషన్ ను కాస్త తగ్గించుకుందట. రోజుకు రూ.50 లక్షలు తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకుందని ప్రచారంలో ఉంది. ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ రెండు వారల్లోపు పూర్తి చేయాలని జక్కన్న ప్లాన్ చేసుకున్నారట. దీనిని బట్టి ఆమె పారితోషకం సుమారు రూ.6 కోట్ల వరకు ఉన్నట్లు అర్థం అవుతోంది. దీనికి హోటల్ ఖర్చులు - వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా అదనంగా ఉన్నాయి. అలియా రెమ్యూనరేషన్ మేకర్స్ కు భారమే అయినా.. ఆమె స్టార్ వాల్యూ హిందీ మార్కెట్ కు ప్లస్ అయింది.

'ఆర్.ఆర్.ఆర్' మూవీ హిందీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ జరగడానికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తో పాటుగా అలియా కూడా కారణమైంది. ఇకపోతే ఈ చిత్రంలో ఆమె తన పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేస్తుందని చిత్ర బృందం ఇప్పటికే హింట్ ఇచ్చింది. ఇటీవల రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అలియా భట్ ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్‌ అని.. ఆమె తెరపై కనిపించే సమయం తక్కువే అయినా ప్రతి సీన్‌ లోనూ ఆమే కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంతో అలియా టాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.
Tags:    
  • Rrr Movie 
  • Alia Bhatt 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS