• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ కోసం నాటి హీరోయిన్...

బన్నీ కోసం నాటి హీరోయిన్ విలన్ కాబోతుందా..?

By - Tupaki Desk
Update: 2020-06-03 12:10 GMT
ఇటీవలే 'అల వైకుంఠపురంలో' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత స్టైలిష్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న పుష్ప మీద ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అన్న టాక్ బాగా సాగుతుంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవాలని చాలా కష్టపడుతున్నారట. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారు. బన్నీకి జోడీగా రష్మిక మందన్న కనిపించబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు సుకుమార్. అయితే ఇందులో విలన్ పాత్రకు విజయ్‌ సేతుపతి, బాబీ, సునీల్ శెట్టి ఇలా పలువురి పేర్లు వినిపించాయి. కానీ ఈ మూవీలో మరో పవర్ ఫుల్ పాత్ర ఉందట.. అదే లేడీ విలన్.

ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం నటి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజాను సుకుమార్ ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌. ఈ సినిమాకి ఆమె పాత్రకు సంబంధించి ఇప్పటికే రోజాను సంప్రదించడం, పాత్ర నచ్చి సినిమాలో నటించేందుకు రోజా ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత రోజా ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రోజా.. ఆ తర్వాత ప్రత్యేక పాత్రల్లో మెప్పించారు. బన్నీ సినిమాకు రోజా నిజంగానే ఓకే చెప్పి ఉంటే టాలీవుడ్‌లో రేర్ కాంబినేషన్ ఫిక్స్‌ అయిందని చెప్పొచ్చు. అంతేకాదు రోజా విలనిజం గాంభీర్యం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమాకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే విడుదలైన పుష్ప పోస్టర్‌తో సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి. మరి బన్నీ వర్సెస్ రచ్చబండ కాంబినేషన్ ఏమవుతుందో చూడాలి!
Tags:    
  • Pushpa 
  • Allu arjun 
  • Sukumar 
  • Rashmika 
  • Villain 
  • Roja 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS