#KGF 2 అంచనాలు పెంచేందుకు రాకీ భాయ్ గ్యాంబ్లింగ్?
సరిగ్గా 2018లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ పాన్ ఇండియా మార్కెట్లో సంచలనాలు సృష్టించిన తీరు ఇప్పటికీ ఒక పాఠంలా అన్ని పరిశ్రమలకు కనిపిస్తోంది. బాహుబలి తర్వాత మళ్లీ కేజీఎఫ్ కే అంతటి పేరొచ్చింది.
2021లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 మళ్లీ అలాంటి సంచలనాలు సృష్టించగలదా? అంటే ఇప్పటికి సస్పెన్స్. నిజానికి ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా మహమ్మారీ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. రిలీజ్ డిలే తప్పలేదు.
ఇక ఈ మూవీ ఫేట్ డిసైడ్ అవ్వాలంటే ముందు టీజర్ - ట్రైలర్ చూడాలి. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను టచ్ చేసే రేంజులో ప్రశాంత్ నీల్ ఈ పార్ట్ 2ని తెరకెక్కించారా లేదా? అన్నది ప్రైమరీ విజువల్స్ చూశాకే డిసైడవుతుంది. జనవరి 8 అందుకు ముహూర్తం పెట్టింది టీమ్. ఆ రోజు టీజర్ రిలీజవుతోంది. టీజర్ తో అంచనాలు పెంచడం అన్నది టీమ్ కి చాలా ఇంపార్టెంట్. అంతటి భారీ తనం నిండిన సినిమా. ప్రపంచం కళ్లు ఉన్న సినిమా కాబట్టి కేజీఎఫ్ హీరో యష్ దైవిక ఆశీర్వాదం కోసం తమిళనాడులోని తిరునల్లార్ శనీశ్వర టెంపుల్ ను సందర్శించారు. వాస్తవానికి అతను తన సినిమా బృందంతో కాకుండా కర్ణాటక డిప్యూటీ సిఎమ్ తో అక్కడకు వెళ్లాడు. ఏదేమైనా ఈ సందర్శన చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. సరిగ్గా టీజర్ విడుదలకు కొద్ది రోజుల ముందు యష్ అలా ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తించే అంశం.
ఇకపై ఊపిరిసలపనంతగా ప్రమోషన్స్ పరంగా స్పీడ్ పెంచే యోచనలో చిత్రబృందం ఉంది. హోంబలే బృందం పాన్-ఇండియన్ రేంజు ప్రమోషన్లకు ప్లాన్ సిద్ధం చేశారట. కొత్త సంవత్సరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా కేజీఎఫ్ 2 ఎలాంటి రిజల్టును అందుకుంటుంది? అన్నదే ఆసక్తిని రేకెత్తించే పాయింట్. కరోనావైరస్ భయాల నడుమ ఇటీవల హైదరాబాద్ లో షూటింగ్ ముగించిన టీమ్ తదుపరి కార్యాచరణలో బిజీగా ఉంది.