మరోసారి సుశాంత్ సోదరిపై రియా సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనూహ్యంగా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. దాదాపు రెండు వారాల క్రితం అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. కాని ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తుంది. రెండవ సారి బెయిల్ పిటీషన్ వేసిన రియాకు నిరాశే మిగిలింది. రియా చక్రవర్తి బయటకు వస్తే కేసు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విచారణ అధికారులు కోర్టుకు తెలియజేస్తున్నారు. దాంతో ఆమెకు బెయిల్ రావడం లేదు.
ఆమెను పూర్తిగా విచారించిన తర్వాతే బెయిల్ కు విచారణ అధికారులు ఓకే చెప్పే అవకాశంది. బెయిల్ కోసం కోర్టు ముందు హాజరు అయిన రియా చక్రవర్తి మాట్లాడుతూ సుశాంత్ మృతికి అతడి కుటుంబ సభ్యులు కారణం అంటూ మరోసారి ఆరోపించింది. అతడి గురించి వారు ఎప్పుడు పట్టించుకోలేదు.. అతడి ఆరోగ్యం గురించి వారు శ్రద్ద తీసుకోలేదు. కేవలం అతడి సంపాదనపై మాత్రమే వారికి ఆశ. అతడి ఆస్తి ఎలాగైనా సొంతం చేసుకునే వారు తప్ప అతడి ఆరోగ్యం విషయంలో కుటుంబంలో ఎవరు కూడా పట్టించుకునే వారు కాదు అంటూ రియా బెయిల్ పిటీషన్ విచారణ సందర్బంగా చెప్పుకొచ్చింది. సుశాంత్ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆమె నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.