పాయల్ వర్సెస్ రిచా... కోడి పొదక ముందే పిల్లల్ని లెక్కపెట్టకు!
ఆ దర్శకుడితో ఫలానా హీరోయిన్ కి ఎఫైర్ ఉందని నోరు జారిన ఫలితం ఎలా ఉంటుందో కోర్టుల పరిధిలో పోరాటం ఎలా సాగించాల్సి ఉంటుందో ఇప్పటికే పాయల్ కి అనుభవమైంది. రిచా చద్దా వర్సెస్ పాయల్ ఘోష్ కోర్టు పోరాటం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఎవరు గెలుస్తారు? అన్నదానికి కోర్టు తీర్పు సమాధానం ఇస్తుంది. అయితే ఈలోగానే రిచా - పాయల్ నడుమ ట్వీట్ వార్ పోయెటిక్ గా రక్తి కట్టిస్తోంది.
పాయల్ క్షమాపణ చెప్పింది .. మేం గెలిచాం.. సత్యమేవ జయతే! అంటూ రిచా చద్దా ట్వీట్ చేయడం.. దానికి స్పందనగా నేను ఎవరికీ క్షమాపణ చెప్పడం లేదని నటి పాయల్ ఘోష్ రీట్వీట్ చేయడంతో వాతావరణం మరోసారి వేడెక్కిపోయింది. ఇంకా కోర్టులో తీర్పు వెలువడక ముందే భజన చేసుకోవడం బాకా ఊదుకోవడమే అవుతుందని రిచా ఆనందంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది పాయల్. స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని గౌరవనీయ హైకోర్టు సూచనకు నేను దానిని అంగీకరించాను. అలా కాకపోతే `కోర్టు ధిక్కారం` అవుతుందనే అర్థం వచ్చేలా పాయల్ ఘోష్ ట్వీట్ చేసారు.
నేను నీ పేరు చెప్పినందుకు మర్యాదపూర్వక క్షమాపణలు మాత్రమే చెప్పాను. కోళ్లు పొదిగే ముందే పిల్లలను లెక్కించడం ద్వారా నిన్ను నువ్వు అనవసరంగా వెలుగులోకి తీసుకురావడానికి ఇది ఒక క్లాసిక్ కేసు`` అంటూ పోయెటిక్ గా కౌంటర్ వేసింది పాయల్. నాకు శ్రీమతి చద్దాతో ఏ సంబంధం లేదు. నాకు ఆమె ఎవరో తెలియదు .. నేను ఆమె గురించి ఆసక్తి గా లేను. నేను ఆమె గురించి ట్వీట్ చేయలేదు. ఈ భూమిపై ఉన్న ప్రతి మానవుడిని నేను గౌరవిస్తాను.. అంటూ పాయల్ వ్యాఖ్యానించింది. అయితే రిచాకు వ్యతిరేకంగా ఘోష్ తన మునుపటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం గురించి పాయల్ న్యాయవాది నితిన్ సాట్పుట్ ప్రకటించడం మీడియాలో ప్రధానంగా హైలైట్ అయ్యింది. ఈ కేసులో అంతిమ తీర్పు ఎవరికి ఫేవర్ గా ఉంటుంది? అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందేమో!