వామ్మో వర్మకు అవంటే భయమట.. అందుకే అమ్మ వెనకాల దాక్కున్నాడట

Update: 2020-11-15 10:10 GMT
ఆర్జీవీ.. ఈ పేరు వింటే చాలు వివాదాలు  కూడా వెనకాలే  పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. అసలు వివాదాలు లేనిదే వర్మకు నిద్ర సైతం పట్టదు. అందుకే ఆయన గొడవలు కొని తెచ్చుకుంటూ వుంటారు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రించే వరకూ  ఇదే ధ్యాసలోనే ఉంటాడు. అందుకే ఆయన గిల్లినా తిరిగి   గిల్లడానికి కూడా ఎవరు ముందుకు రారు.రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వివాదాలు సృష్టిస్తూ ఉంటాడు.


దీపావళిని కూడా వర్మ తన స్టయిల్ లో జరుపుకున్నాడు. తల్లి, సోదరితో కలిసి ఇంటి ముందు బాణసంచా  పేల్చాడు. వర్మ సోదరి చిచ్చుబుడ్లు పేలుస్తుండగా భయంతో ఆయన తల్లి చాటుకు వెళ్లాడు. ఈ వీడియోను వర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిపై కామెంట్ చేస్తూ ‘ నేను సాధారణంగా చాలా పిరికివాడిని. అందుకే తల్లి వెనుకన దాక్కున్నాను’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.  

తల్లి సోదరి తో పాటు వర్మ కూడా చిచ్చుబుడ్లు కాల్చాడు. ఆ వీడియోని కూడా  పోస్ట్‌ చేశాడు. దీనికి మాత్రం వెరైటీ కాప్షన్ ఇచ్చాడు.దీపావళి సందర్భంగా వాయు,శబ్ధ కాలుష్యానికి తన  వంతు సహకారం ఆందిస్తున్నట్లు సెటైరిక్ గా చెప్పుకొచ్చాడు. దాంతో పాటు మరో ట్వీట్ చేస్తూ పండగ సందర్భంగా  వోడ్కా రుచి చూడాలని  నా తల్లి, సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా’ అంటూ వోడ్కా గ్లాస్‌ తన తల్లి ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటోని అని ట్వీట్‌ చేశాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వర్మ ఎప్పటికీ వర్మ నేనని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News