మహేష్‌ - ప్రభాస్‌ లతో అయితే ఓకే : రేణు దేశాయ్‌

Update: 2020-05-03 05:50 GMT
సీనియర్‌ హీరోయిన్స్‌ కు ఈ మద్య అమ్మగా అక్కగా మంచి డిమాండ్‌ ఉన్న విషయం తెల్సిందే. స్టార్‌ హీరోయిన్స్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోలతో రొమాన్స్‌ చేసి ఇప్పుడు వారి సినిమాల్లోనే కీలక పాత్రల్లో నటిస్తూ కనిపిస్తున్నారు. ఇక కొందరు హీరోయిన్స్‌ యంగ్‌ హీరోలకు అమ్మ పాత్రల్లో మెరుస్తున్నారు. అమ్మగా మారిన హీరోయిన్స్‌ జాబితాలో రేణు దేశాయ్‌ కూడా జాయిన్‌ అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో రేణు దేశాయ్‌ మాట్లాడుతూ మళ్లీ సినిమాలు చేయాలనే అనుకుంటున్నాను. కాని మంచి పాత్రల్లో మాత్రమే నటించాలనుకుంటున్నాను. హీరోలకు తల్లి పాత్రలో నటించేందుకు కూడా నేను సిద్దమే అన్నట్లుగా రేణు దేశాయ్‌ క్లారిటీ ఇచ్చింది. తెలుగులో మహేష్‌ బాబు.. ప్రభాస్‌ వంటి స్టార్స్‌ కు అమ్మ పాత్రల్లో నటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్‌ బాబు కంటే దాదాపు అయిదేళ్లు చిన్న వయసు అయినా కూడా రేణు దేశాయ్‌ ఆయనకు తల్లిగా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పడం నిజంగా అభినందనీయం.

హీరోయిన్‌ గా చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అవ్వడంతో ఈమెకు విపరీతమైన క్రేజ్‌ తెలుగు జనాల్లో ఉంది. రేణు దేశాయ్‌ గురించిన ప్రతి విషయంపై కూడా అందరికి ఆసక్తి ఉంటుంది. ఇక పవన్‌ లేదా ప్రభాస్‌ సినిమాల్లో రేణు దేశాయ్‌ ఒకవేళ తల్లి పాత్రను చేస్తే కనుక ఆ సినిమాల క్రేజ్‌ రెట్టింపు అవ్వడం ఖాయంగా చెప్పుకోవచ్చు. ఈమె వారికి తల్లిగా నటించేందుకు ఓకే చెప్పింది మరి వారు రేణు దేశాయ్‌ కు కొడుకుగా నటించేందుకు ఆసక్తిగా ఉంటారా చూడాలి.
Tags:    

Similar News