ప్రేమలో మోసపోయిన వారికి రేణు దేశాయ్ సందేశం..!

Update: 2020-11-27 04:30 GMT
'బద్రి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రేణూ దేశాయ్.. 'జానీ' సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తూ వచ్చింది. రచయితగా ఎడిటర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణు సామాజిక అంశాలపై తనదైన శైలిలో మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన రేణు.. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రేమలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి సందేశం అందించింది రేణు.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ''జీవితంలో మీ కంటే ఎవరు మీకు ముఖ్యం కాదు. మీ ప్రాణం అన్నిటి కంటే ముఖ్యం. లవ్ లో ఫెయిల్ అయితే బాధగా ఉంటుంది నిజమే. ప్రేమలో ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఆ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టమే. కానీ దానికి ఆత్మహత్య అనేది మార్గం కాకూడదు. అలాంటి సమయంలో కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఆ బాధ నుంచి కోలుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఫ్యామిలీ లేదా స్నేహితులతో గడపడం మంచిది. ఎప్పుడైనా సరే ఒక మనిషి జీవితం మరొక వ్యక్తి కారణంగా ముగియడం అనేది కరెక్ట్ కాదని నమ్మండి'' అని చెప్పుకొచ్చింది.
 
కాగా, రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. పవన్ తో విడిపోయాక రేణు ప్రస్తుతం తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నట్లు రేణు దేశాయ్‌ ఇటీవల ప్రకటించారు. ''ఆద్య'' అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్‌ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టింది. అందులో ఆధ్య అనే కంపెనీకి సీఈఓగా కనిపించనుంది. 'ఆద్య' అనేది రేణు దేశాయ్ కూతురి పేరనే విషయం తెలిసిందే.
Tags:    

Similar News