మైథాలజీ నుంచి మాస్ యాక్షన్ వరకు… రణబీర్ రేంజ్ నెక్ట్స్ లెవెల్!

ఇండ‌స్ట్రీలో ఒక స్టార్ కంబ్యాక్ ఎలా పూర్తిస్థాయి డామినేషన్‌గా మారుతుందో బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ లైఫ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.;

Update: 2026-04-24 01:30 GMT

ఇండ‌స్ట్రీలో ఒక స్టార్ కంబ్యాక్ ఎలా పూర్తిస్థాయి డామినేషన్‌గా మారుతుందో బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ లైఫ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. యానిమ‌ల్ సినిమాతో కెరీర్‌లో కీలక మలుపు తీసుకున్న రణబీర్, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. కేవలం ఒక హిట్‌తో సరిపెట్టుకోకుండా, స్ట్రాటజిక్‌గా ఎంపిక చేసిన సినిమాలతో ఆయన కెరీర్‌ను కొత్త దిశగా మలుస్తున్న తీరు గమనించదగ్గది. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే ఇది సాధారణ లైనప్ కాదని, ఒక క్లియర్ గేమ్ ప్లాన్ అని స్పష్టమవుతోంది. 2026 నుంచి 2029 వరకు దాదాపు నాలుగేళ్ల పాటు గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్స్, రిలీజ్‌లు ప్లాన్ చేసుకోవడం ఆయన డిమాండ్, ప్లానింగ్‌ను బలంగా సూచిస్తోంది.

ర‌ణ్‌బీర్ లైన‌ప్ నెక్ట్స్ లెవెల్!

రణబీర్ లైనప్‌లోని వైవిధ్యం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవైపు రామాయ‌ణ లాంటి మైథాలజీ ఎపిక్‌ను రెండు పార్ట్స్‌గా రూపొందిస్తుండగా, మరోవైపు యానిమ‌ల్ పార్క్ లాంటి డార్క్ యాక్షన్ సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో బ్ర‌హ్మాస్త్ర‌2 లాంటి ఫాంటసీ అడ్వెంచర్‌తో మరో జానర్‌ను టచ్ చేస్తున్నారు. ఈ రేంజ్ చూస్తే పాన్ ఇండియా నుంచి మైథాలజీ వరకు, మాస్ యాక్షన్ నుంచి విజువల్ ఫాంటసీ వరకు అన్ని కోణాల్లో తనను ప్రూవ్ చేసుకోవాలనే స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోంది. అంతేకాదు, సీక్వెల్స్ ట్రెండ్‌ను కూడా సమర్థంగా వినియోగించుకుంటూ యానిమ‌ల్ పార్క్, బ్ర‌హ్మాస్త్ర‌2 లతో బాక్సాఫీస్ రేస్‌లో ముందంజలో ఉండాలని చూస్తున్నారు.

విభిన్న శైలి డైరెక్ట‌ర్ల‌తో!

ఇక టాప్ డైరెక్టర్లతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా ఈ లైనప్‌ను మరింత బలంగా నిలబెడుతున్నాయి. ప్ర‌స్తుతం సంజ‌య్ లీలా భ‌న్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ల‌వ్ అండ్ వార్ త్వ‌ర‌లో రిలీజ్ కానుండ‌గా, ఆ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగాతో యానిమ‌ల్ పార్క్, అయాన్ ముఖ‌ర్జీతో బ్ర‌హ్మాస్త్ర‌2 .. ఇలా విభిన్న స్టైల్స్ ఉన్న దర్శకులతో పని చేయడం ఆయన కెరీర్‌కు కొత్త డైమెన్షన్ తీసుకొస్తోంది. ఈ కాంబినేషన్స్ మాత్రమే కాదు, ప్రాజెక్ట్స్ స్కేల్, బడ్జెట్, రిలీజ్ ప్లానింగ్.. అన్నీ కలిపి చూస్తే, రణబీర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా మారాడనే అభిప్రాయం బలపడుతోంది. ఒకే సమయంలో ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ ఒక హీరో చేతిలో ఉండటం అరుదైన విషయమే.

కెరీర్లో నెక్ట్స్ లెవెల్‌కు..

మొత్తానికి, ర‌ణ్‌బీర్ క‌పూర్ కెరీర్లో ఇది గోల్డెన్ ఫేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కంబ్యాక్ తర్వాత వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుని, సరైన టైమ్‌లో సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ప్రభావం చూపిస్తాయో చూడాలి గానీ, ప్రస్తుతానికి మాత్రం రణబీర్ కపూర్ బాలీవుడ్‌లో డామినేషన్ దిశగా వేగంగా ముందుకు సాగుతున్న స్టార్‌గా స్పష్టంగా కనిపిస్తున్నారు.

Tags:    

Similar News