పెళ్లి అవసరమే కానీ అందుకు వయసుతో పనిలేదు!
ఒకప్పుడు బంధువుల నుండి పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు ఎదురయ్యేవని ఆ సమయంలో కొంత ఇబ్బందిగా అనిపిం చేదని గుర్తు చేసుకుంది.;
'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న నటి మేధా శంకర్. ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత వేగంగా దూసుకుపోతుంది. వరుస సినిమాలో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో అమ్మడు తన వ్యక్తిగత జీవితం ,పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టమే కానీ అందుకు వయసుతో సంబంధం లేదంది. సరైన సమయం వచ్చినప్పుడే పెళ్లి జరుగు తుందని తన అభిప్రాయాన్ని ఓపెన్ గా షేర్ చేసుకుంది. ప్రస్తుతం పెళ్లి విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని మేధ స్పష్టం చేసింది.
ఒకప్పుడు బంధువుల నుండి పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు ఎదురయ్యేవని ఆ సమయంలో కొంత ఇబ్బందిగా అనిపిం చేదని గుర్తు చేసుకుంది. అయితే ఇప్పుడు కెరీర్ ఎదుగుతోన్న తీరును చూసి వారు కూడా మౌనంగా ఉండిపో యారంది. పెళ్లి విషయంలో తల్లిదండ్రలు కూడా ఏం మాట్లాడలదేని, పూర్తిగా తనకు కావాల్సినంత స్వేచ్ఛ కల్పిం చారంది. చాలా మంది అమ్మాయిలకు పెళ్లి విషయంలో తల్లిదండ్రుల నుండే మొదటి ఒత్తిడి మొదలవుతుందని, కానీ తన విషయంలో మాత్రం వారు ఎంతో సహకరిస్తున్నారని తెలిపింది. తన ఇష్టాఇష్టాలను గౌరవిస్తూ, కెరీర్‌లో ముందుకు సాగేందుకు వారు అందిస్తోన్న ప్రోత్సాహమే తన విజయానికి కారణమని పేర్కొంది.
తల్లిదండ్రుల మద్దతు ఉంటే ఏ అమ్మా యైనా లక్ష్యాలను సులభంగా చేరుకోగలదని అభిప్రాయపడింది. పెళ్లి అనేది సామాజిక బాధ్యతగా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇష్టం , అవగాహనపై ఆధారపడి ఉండాలని మేధా నమ్ముతానంది. వయసు పెరిగిపోతుందనో? లేదా సమాజం ఏమనుకుంటుందనో? పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో ఆనందం ఉండదని అంతా భావిస్తారు. కానీ ఇదంతా తప్పు. సరైన భాగస్వామి దొరికినప్పుడు, మాన సికంగా సిద్ధమైనప్పుడు మాత్రమే పెళ్లి నిర్ణయం తీసుకోవాలంది. దానికి 20 ఏళ్లు లేదా 30 ఏళ్లు అనే పరిమితులు ఉండకూడదని అభిప్రాయపడింది.
ప్రస్తుతానికి తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ప్రశాంతంగా మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యమని మేధా శంకర్ తెలిపింది. `ట్వెల్త్ ఫెయిల్` ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటూ విభిన్నమై నపాత్రల్లో నిరూపించుకోవాలని అమ్మడు ఆరాటపడుతుంది. అందుకే ఇప్పుడు పెళ్లి విషయాలు ఆలోచించి ఏకాగ్రతను దెబ్బతీసుకోవడం ఇష్టం లేదంది. మేధా శంకర్ ఆలోచనా దృక్పథం నేటి తరం అమ్మా యిలకు స్పూర్తిదాయకంగా ఉంది. కెరీర్ ,వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న నటి పెళ్లి విషయంలో తనకున్న స్పష్టతను చాటుకుంది.