అనౌన్స్‌మెంట్ మాత్రమేనా? జాంబీ ప్రాజెక్ట్‌పై భారీ డౌట్స్

బాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ చుట్టూ చర్చ మొదలైంది. నిర్మాత ఫిరోజ్ న‌దియాద్వాలా ఒక జాంబీ కామెడీని ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.;

Update: 2026-04-24 02:45 GMT

బాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ చుట్టూ చర్చ మొదలైంది. నిర్మాత ఫిరోజ్ న‌దియాద్వాలా ఒక జాంబీ కామెడీని ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమ‌లో టైగ‌ర్ ష్రాఫ్, ష‌నాయా క‌పూర్ జంటగా నటించనున్నారని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్‌పై హైప్ కంటే ఎక్కువగా సందేహాలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా భవిష్యత్ పూర్తిగా వెల్‌క‌మ్ టు ది జంగిల్ రిజ‌ల్ట్ పై ఆధారపడి ఉందనే విశ్లేషణ ఇప్పుడు ప్రధానంగా ముందుకు వస్తోంది.

ప్రస్తుతం టైగర్ శ్రాఫ్ కెరీర్‌లో క్లిష్ట దశలో ఉన్నారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత అతనికి ఒక బలమైన హిట్ అవసరం. అదే సమయంలో ష‌నాయా కపూర్ ఇంకా తన మొదటి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో జాంబీ కామెడీ లాంటి రిస్కీ జానర్‌ను ఎంచుకోవడం ఇద్దరికీ డూ ఆర్ డై లాంటిది. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు, భారీ VFX, డార్క్ హ్యూమర్, స్టంట్స్ కలిపి చేసే పెద్ద ప్ర‌యోగ‌మ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే అలాంటి ప్రాజెక్టులు సక్సెస్ అయితే కెరీర్ మలుపు తిరుగుతుంది, లేకపోతే మరింత కష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఇక ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న మ‌రో మెయిన్ డౌట్, అస‌లు ఇది నిజంగా తెరకెక్కుతుందా? లేక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? అనేదే. ఫిరోజ్ నడియాద్వాలా గతంలో కూడా అనేక భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించి వాటిని ఆచరణలోకి తీసుకురాలేదనే విమర్శలు ఉన్నాయి. ఆవారా పాగ‌ల్ దీవానా2, హేరా ఫేరీ3 వంటి సినిమాలు ఇప్పటికీ క్లారిటీ లేకుండా ఉండటం ఇందుకు ఉదాహరణలుగా చెప్పబడుతున్నాయి. దీంతో అనౌన్స్‌మెంట్స్ ఎక్కువ‌, ఆచ‌ర‌ణ‌లో పెట్టేది త‌క్కువ అనే ట్యాగ్ ఆయనపై ప‌డిపోయింది. ఈ కొత్త జాంబీ ప్రాజెక్ట్ కూడా అదే జాబితాలో చేరుతుందా? అనే అనుమానం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.

ఈ సందేహాలన్నింటినీ మెయిన్ రీజ‌న్ వెల్‌క‌మ్ టు ది జంగిల్ ప్రోగ్రెస్. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా డెవలప్‌మెంట్‌లోనే ఉండటం, ఇంకా స్పష్టమైన రిలీజ్ డేట్ లేకపోవడం, ప్రాజెక్ట్ అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సినిమా రిలీజై, హిట్ అయితే మాత్రమే కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంటే ఒక సినిమా ఫలితం మరో సినిమా భవిష్యత్తును నిర్ణయించే స్థితి ఏర్పడింది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ క్రెడిబిలిటీపై కూడా ప్రభావం పడుతోంది. వరుసగా అనౌన్స్ అవుతున్న కానీ ఆచరణలోకి రాని ప్రాజెక్ట్‌లు ప్రేక్షకులలో అనుమానాలను పెంచుతున్నాయి. టైగర్ ష్రాఫ్‌కు ఇది కంబ్యాక్ ఛాన్స్‌గా మారుతుందా? ష‌నాయా కపూర్‌కు బ్రేక్ ఇస్తుందా? అన్న ప్రశ్నల కంటే ముందు ఈ సినిమా నిజంగా సెట్స్‌పైకి వస్తుందా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తానికి, ఈ జాంబీ కామెడీ ప్రాజెక్ట్ ఫ్యూచ‌ర్ పూర్తిగా వెల్‌క‌మ్3 రిజ‌ల్ట్‌తో ముడిపడి ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News