మొత్తంగా మానటం కష్టం..కంట్రోల్ చేసుకోమన్న రేణు దేశాయ్
దీపావళి వేళ.. సినీ తారలు.. సెలబ్రిటీలు తమ మెసేజ్ లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే.. రోటీన్ కు భిన్నంగా కొందరు పెడుతున్న పోస్టులు బాగా పాపులర్ కావటమే కాదు.. వైరల్ గా మారుతున్నాయి. ఆ కోవలోకే వస్తుంది ప్రముఖ నటి.. పవన్ మాజీ శ్రీమతి రేణు దేశాయ్ పెట్టిన పోస్టు. దీపావళి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్పిన ఆమె.. మిగిలిన వారికి భిన్నంగా తన గ్రీటింగ్స్ ను చెప్పారు. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉండే ఆమె.. దీపావళి అంటేనే టపాసులని.. వాటిని కాల్చొద్దని చెప్పలేమన్నారు.
క్రాకర్స్ మొత్తానికి కాల్చొద్దని తాను చెప్పనని.. ఎంతవరకు కుదిరితే అంతవరకు కాల్చటం తగ్గించమని కోరారు. ‘‘క్రాకర్స్ కాల్చకుండా ఉండటం కష్టం. ఎందుకంటే అది మన సంప్రదాయం. దీపావళి అంటేనే టపాసులు కాల్చటం.. దీపాల వెలుగులో ఆనందంగా గడపటం. అదెప్పటి నుంచో వస్తోంది. కాకుంటే కాకర్స్ విషయంలో కంట్రోల్ లో ఉండటం బెటర్. శబ్దకాలుష్యం.. వాతావరణ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించండి’’ అని పేర్కొన్నారు. తన సందేశాన్ని అచ్చ తెలుగులో చెప్పిన రేణు.. తన క్యూట్ మెసేజ్ తో ఎవరిని మనసుల్ని నొప్పించకుండా మెప్పించారని చెప్పక తప్పదు.