ఆ కారణమేంటో ఇప్పుడు చెప్పనంటున్న రేణు దేశాయ్..!

Update: 2020-12-22 12:30 GMT
తెలుగు సినీ అభిమానులకు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటిగాకాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా దర్శకురాలిగా మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది. గత కొన్నాళ్ళుగా నటనకు దూరం అయినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ తన పర్సనల్ లైఫ్‌ కు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తుంది. తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్ - ఆద్య ల ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అప్‌లోడ్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

చికెన్ డ్యాన్స్ అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కూతురు ఆద్య డ్యాన్స్ చేస్తూ ఉండగా రేణు పెద్దగా నవ్వుతూ ఉంది. దీనికి 'మేమే ఇలా ఎందుకు నవ్వుతున్నామో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే' అని కామెంట్ పెట్టింది రేణు. దానికి గల కారణం ఏంటో ఆమె త్వరలోనే వెల్లడిస్తుందేమో చూడాలి. కాగా, పవన్ కళ్యాణ్ ని ప్రేమ వివాహం చేసుకున్న రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లోనే ఉంటున్న రేణు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. ''ఆద్య'' అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్‌ తో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ త్వరలోనే రానుంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CJDyUMjhW9Y/
Tags:    

Similar News