• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మళ్ళీ కెమెరా ముందుకు...

'మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నా..స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న మ‌హిళను ఆశీర్వదించండి'

By - Tupaki Desk
Update: 2020-09-20 16:30 GMT
టాలీవుడ్ లో నటి రేణు దేశాయ్‌ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 'బద్రి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రేణూ దేశాయ్.. పవన్ కళ్యాణ్ తో కొన్నాళ్ళు సహజీవనం చేసి వివాహం చేసుకుంది. 'జానీ' సినిమా తర్వాత నటనకు దూరం అయిన రేణు.. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎడిటర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా కొనసాగుతూ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ తో విడిపోయాక ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నట్లు రేణు దేశాయ్‌ స్వయంగా ప్రకటించారు. ఓ అందమైన వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని.. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఇంస్టాగ్రామ్ లో  పేర్కొన్నారు. ఈ సిరీస్ ని సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీఎస్‌. రావు - ఎస్‌. రజనీకాంత్ నిర్మించనున్నారని.. కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్‌ చేస్తారని.. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌ అని రేణు దేశాయ్ తెలిపారు.

''మళ్ళీ కెమెరా ముందుకొస్తున్నాను. ఓ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్‌ లో నటించేందుకు సైన్ చేశాన‌ని అనౌన్స్ చేస్తున్నందుకు ఎక్జైయిటింగ్‌ గా ఉంది. వ‌చ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు చెప్తాను. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళ ప్ర‌యాణానికి మీ ఆశీస్సులు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుకుంటున్నాను'' అని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. ''చాలా రోజులుగా అందరూ మళ్ళీ యాక్ట్ చేస్తారని అడుగుతున్నారు. మంచి స్క్రిప్ట్.. మంచి రోల్.. మంచి ప్రొడక్షన్ దొరికితే చేస్తా అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు అవన్నీ కుదిరిన ఈ అందమైన వెబ్ సిరీస్ కి సైన్ చేశాను' అని ఇన్స్టా లైవ్ లో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఇంతకముందు 'ఇష్క్ వాలా లవ్' అనే సినిమాకి దర్శకత్వం వహించిన రేణు.. రైతు సమస్యలపై ఓ సినిమా చేయడానికి సంకల్పించారు. ఈ సినిమాకి 'అన్నదాత సుఖీభవ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆమెకు డైరెక్టర్ గా తెలుగు డెబ్యూ అని చెప్పవచ్చు.
Tags:    
  • Renu Desai 
  • Web Series 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS