రెజీనా నిజంగానే లవ్ ఫెయిల్యూరా?

Update: 2017-09-20 01:30 GMT
రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ రెజీనా కసాండ్రా. మొదట తమిళ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైనా ఈ భామ అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ ఆదరణ దక్కించుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ.. దాదాపు కుర్ర హీరోయిలందరితో జోడి కట్టింది. అలాగే మలయాళం లో కూడా ఈ చెన్నై సుందరి మంచి ఆదరణను దక్కించుకుంది. కాకపోతే ఈ మధ్యనే వచ్చిన నక్షత్రం కోసం ఎంతగా అందాలను ఆరబోసినా కూడా సినిమా మిస్ ఫైర్ అయ్యింది.

ఇకపోతే గత కొంత కాలంగా రెజినాపై కొన్ని రూమర్స్ తెగ హల్ చేస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ అమ్మడు నిజమనేని చెప్పిందట. కానీ ఆ విషయాలు ఎక్కువగా బయటపడలేదు. అప్పట్లో ఓ హీరో రెజీనాను గాఢంగా ప్రేమించాడట. అంతే కాకుండా  పెళ్లి చేసుకోమని కూడా కోరాడని , రెజీనా పేరెంట్స్ తో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే రెజీనా మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదట. ఎందుకంటే ఇప్పుడిపుడే కెరీర్ సెట్ అవుతోంది. అలాగే తనకంటూ కొన్ని ఆశయాలు ఉండడం వల్ల నో చెప్పిందట. అయితే ఆ హీరో ప్రముఖ హీరోల కుటుంబానికి చెందినవాడని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతే కాకుండా రెజీనా ప్రేమని అస్సలు నమ్మదట. ఎందుకంటే కెరీర్ మొదట్లో ప్రేమలో పడి అల్ రెడీ దెబ్బ తిన్నట్లు ఆమె చెప్పిందట. ప్రస్తుతం తన ముందు కెరీర్ ఒక్కటే కనిపిస్తుందని  ప్రేమ - పెళ్లి అనే పదాలకి కొన్ని రోజులవరకు చోటివ్వను అంటోందట. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు గాని వీటిపై రెజీనా అధికారికంగా ఏ విధమైన కామెంట్స్ చేయలేదు. ప్రస్తుతానికి అమ్మడు మూడు తమిళ్ సినిమాల్లో అలాగే ఒక కన్నడ సినిమాల్లో నటిస్తోంది.         


Tags:    

Similar News