ఫోటో స్టోరి: వావ్ రెజీనా..

Update: 2018-03-26 08:05 GMT
ఈ మధ్య కాలంలో విజయం కోసం ఎక్కువగా ప్రయోగాలు చేస్తోన్న బ్యూటీలల్లో రెజీనా టాప్ లో ఉందనే చెప్పాలి. చూడగానే నవ్వుతో ఆకర్షించే ఈ సుందరి కొంచెం ఘాటుగా కనిపించినా ఆ లెక్కే వేరేలా ఉంటుంది. రెజీనా గ్లామర్ కోసమైనా సినిమా కు వెళ్లాలని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె లక్ ఏమిటో గాని అస్సలు దగ్గరికి రానివ్వడం లేదు.

అమాయకంగా కనిపించేం పిల్ల ఒక్కసారిగా గ్లామర్ టచ్ ఇస్తే లక్ వచ్చినట్టే వచ్చి కనిపించకుండా మాయమైపోయింది. సాధారణంగా కనిపించి హిట్టు కొట్టిన రెజీనా గ్లామర్ గర్ల్ గా మాత్రం హిట్టు కొట్టలేకపోతోంది. ముఖ్యంగా నక్షత్రం సినిమాలో ఎలా కనిపించిందో అందరికి తెలిసిందే. స్పైసి అందాలను తెరపై ఎంతో అందంగా ప్రదర్శించింది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రెజీనకి సంబందించిన ఒక ఫొటో అందరిని షాక్ కి గురి చేస్తోంది.

వాటర్ ఫాల్స్ పక్కన రెడ్ డ్రెస్ లో అమ్మడు ఇచ్చిన సెక్సీ స్టిల్ వావ్ అనిపించేలా చేస్తోంది. పక్కన యువ హీరో కూడా ఉన్నాడు. అందమైన ఆ స్టిల్ ఒక పాటలోది. ప్రస్తుతం రెజీనా కోలీవుడ్ హీరో గౌతమ్ తో మిస్టర్ చంద్రమౌళి అనే ఒక సినిమాను చేస్తోంది. గౌతమ్ తండ్రి కార్తీక్ కూడా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. విశాల్ తో ఇంద్రుడు అనే సినిమాకు దర్శకత్వం వహించిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా రెజీనా హిట్టు అందుకుంటుందో లేదో చూడాలి.     


Tags:    

Similar News