ఫస్టు టైమ్ ఖాకి డ్రెస్ లో అదరగొట్టేయనున్న ప్రభాస్!

Update: 2021-10-14 06:30 GMT
ప్రభాస్ ఇప్పుడు తనదైన దూకుడుతో దుమ్మురేపేస్తున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను చక్కబెడుతూ దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు నిదానమే ప్రధానం అన్నట్టుగా ఒక సినిమా తరువాత ఒకటిగా చేసుకుంటూ వెళ్లిన ప్రభాస్, ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా పరుగులు తీస్తున్నాడు. ఎక్కడ ఎలాంటి హడావిడి చేయకుండా చాలా సింపుల్ గా భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన రీసెంట్ గా 'స్పిరిట్' అనే సినిమాను లైన్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

ఈ కథ  చాలా అద్భుతంగా ఉంటుందనీ .. చాలా కాలంగా తన అభిమానులు తనని ఎలా చూడాలని కోరుకుంటున్నారో, ఈ సినిమాలో తాను అలాగే కనిపిస్తానని ప్రభాస్ చెప్పాడు. దాంతో ఈ సినిమాలో ఆయన పోషించనున్న పాత్ర విషయంలో  ఊహాగానాలు మొదలైపోయాయి. ప్రభాస్ ఇంతవరకూ ఏ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు. ఆయన హైటూ .. పర్సనాలిటీ ఆ పాత్రకి ఒక రేంజ్ లో సెట్ అవుతుంది  గనుక, సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆయనకి తమ మనసులోని మాటను చెబుతూనే వస్తున్నారు.

ఇంతవరకూ ఒకటి రెండు సినిమాలలో పోలీసులకు సహకరించే పాత్రలను చేశాడుగానీ, ఖాకి డ్రెస్ మాత్రం వేయలేదు. ఆ పాత్రలో తాను కనిపించాలనే అభిమానుల ముచ్చటను ప్రభాస్ ఈ సినిమాతో తీర్చనున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ మాటల్లో అర్థం అదేనని అంటున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ పాత్రలో ఆయన అదరగొట్టేయనున్నాడని చెబుతున్నారు. ఇక సందీప్  రెడ్డి తన సినిమాలలోని కథానాయకుల పాత్రలను డిజైన్ చేసే పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది. అందువలన ఆ వైపు నుంచి కూడా ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో శ్రుతి హాసన్ .. కృతి సనన్ కథానాయికలుగా చేస్తున్నారు. ఇక పూజ హెగ్డే ఆల్రెడీ 'రాధే శ్యామ్' చేసేసింది. అందువలన 'స్పిరిట్' సినిమాలో రష్మిక .. కీర్తి సురేశ్ .. కియారా అద్వానీలలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చని చెప్పుకుంటున్నారు. 'సలార్' .. 'ఆది పురుష్' పూర్తి చేసిన ప్రభాస్, ఆ తరువాత నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. అందుకు సంబంధించిన పనులను నాగ్ అశ్విన్ చకచకా పూర్తి చేసేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా తరువాతనే సందీప్ రెడ్డి వంగాతో ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.  
Tags:    

Similar News