నయనతార రాజకీయాలే కారణమా?

Update: 2015-10-06 15:30 GMT
నయనతార.. సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ లలో నయన్ పేరు అగ్రభాగాన ఉంటుంది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించేసుకుంది. మయూరి లాంటి లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లను కూడా.. సింగిల్ హ్యాండ్ తో సూపర్ హిట్ చేసేయగల సత్తా ఆమెకుంది. చిన్న, పెద్ద హీరోలందరితోనూ భారీ సక్సెస్ లు కొట్టిన క్రెడిట్ నయన్ ది. ఇప్పుడు తమిళనాట ఈమె పేరు మార్మోగిపోతోంది. అభిమానులు ఈమెకోసం వెర్రెక్కిపోతున్నారు.

ఎంతలాగో తెలియాలంటే.. తమిళనాడులోని సేలంలో జరిగిన విషయం తెలుసుకోవాలి. సేలంలో షూటింగ్ కోసం నయనతార వచ్చిందని తెలిసి... చుట్టు పక్కల ఊళ్లనుంచి బళ్లు కట్టుకుని మరీ వచ్చేశారు. అసలే లవ్ స్టోరీలు కూడా ఫ్లాపైన సింపథీ కూడా ఈమెకుబాగానే పని చేస్తోంది. నయన్ ని చూడ్డానికి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోయందంటే.. అక్కడ ఈమెకున్న క్రేజ్ అర్ధమవుతుంది. దీన్ని గమనించిన పొలిటికల్ పార్టీలు.. తర్వాతి ఎలక్షన్స్ కి నయనతారను రంగంలోకి దించాలని భావిస్తున్నాయి.

ఇప్పటికే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆఫర్ కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏమీ చేయకపోయినా.. ఈ ఆఫర్ ని నయన్ తిరస్కరించిందని సన్నిహితవర్గాలు చెబ్తున్నాయి. నయన్ కు ఆఫర్ ఇచ్చిన ఆ పార్టీ ఏంటో తెలుసా.. ఇంకెవరు తమిళనాట పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీయే. రీసెంట్ గా నయనతార ఇంటిపై ఐటీ దాడులు జరగడానికి కూడా... ఈ మంతనాలే కారణం అని చెప్పుకుంటున్నారు కోలీవుడ్ లో.
Tags:    

Similar News