అనుష్క అందుకే కనిపించట్లేదు
అనుష్కది అసలే భారీ అవతారం. అలాంటిది సైజ్ జీరో సినిమా కోసం 20 కిలోలకు పైగా బరువు పెరగాలని డైరెక్టర్‌గారు సెలవిచ్చారు. ఇక చేసేదేముంది.. డైటింగ్ గీటింగ్ పక్కనబెట్టేసి.. తెగ లావైపోతోంది అనుష్క. మొన్న బాహుబలి ఆడియో ఫంక్షన్లో ఎంత కవర్ చేసి అమ్మడి బరువు సంగతి అందరికీ తెలిసిపోయింది. బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ మూవీలో నటించాను అని గర్వంగా చెప్పుకోవడం ఎవరికైనా ఇష్టమే. అనుష్కకు కూడా ఆ ఆశ లేకపోలేదు. ఆడియో ఫంక్షన్లో.. ఆ తర్వాత ముంబయిలో, చెన్నైలో ఒక్కోసారి తళుక్కుమంది. కానీ అంతకుమించి ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం లేకపోయింది జేజెమ్మకు.
'సైజ్ జీరో' తర్వాతి షెడ్యూల్ కోసం బ్యాంకాక్‌లో ప్రకాష్ అండ్ టీమ్ ఎదురు చూస్తుండటంతో అక్కడికి వెళ్లిపోయింది అనుష్క. చివరి పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించాక అనుష్క రెండు వారాల పాటు తిండి వ్రతం పట్టి.. మరింతగా బరువు పెరిగిందట. ఇప్పుడు ఇంకో ఆరేడు కిలోలు పెరిగి.. చూడ్డానికి ఎబ్బెట్టుగా తయారైందని సమాచారం. ఇక 'సైజ్ జీరో' మొత్తం పూర్తి చేసి.. మళ్లృ సన్నబడ్డాకే మీడియాకు కనిపించాలని భావిస్తోందట అనుష్క. అందుకే బాహుబలి ప్రమోషన్స్‌లో ప్రభాస్, రానా, తమన్నా కనిపిస్తున్నారు తప్పితే.. అనుష్క దర్శనమివ్వట్లేదు. ఎలాగూ బాహుబలి ఫస్ట్ పార్ట్‌లో తనకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ, అందులోనూ డీగ్లామరస్‌గా కనించబోతోంది.. అందుకే ఈసారికి లైట్ తీసుకుని రెండో పార్ట్ రిలీజ్ టైంలో ప్రమోషన్ కుమ్మేద్దామని డిసైడైంది అనుష్క. అదీ మ్యాటర్!