• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC 15 రీ స్టార్ట్.. ఏం...

RC 15 రీ స్టార్ట్.. ఏం జరుగుతోందంటే?

By - Tupaki Desk
Update: 2022-07-01 16:30 GMT
రామ్ చరణ్ తేజ్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. RRR సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న రాంచరణ్ తేజ్.

ఎలాగైనా RC15 సినిమాతో సోలోగా ఫ్యాన్ ఇండియా మార్కెట్ ను మరింత విస్తృతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆచార్య సినిమాతో కాస్త డీలా పడినప్పటికీ కూడా ఈ సినిమాపై అయితే మెగా పవర్ స్టార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

శంకర్ కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. దాదాపు ఈ సినిమాకు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సినిమా రిజల్ట్ చాలా కీలకం కానుంది. అందుకే బడ్జెట్ విషయంలో వర్క్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగుతున్నారు. అసలైతే ఈ ఏడాది సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలి అని చాలా తొందరగా ప్రాజెక్టును ముగించాలని అనుకున్నారు.

కానీ శంకర్ మాత్రం మరికొంత సమయం అడగడంతో దిల్ రాజు కూడా ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సంక్రాంతి కాకుండా 2023 సమ్మర్ లో సినిమా విడుదల ఉండవచ్చని సమాచారం. అంతే కాకుండా కొంత బడ్జెట్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా అమృత్ సాగర్ లో మరొక షెడ్యూల్ ను మొదలుపెట్టినట్లు సమాచారం. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు టాక్. రామ్ చరణ్ అక్కడికి రాగానే కొంతమంది అభిమానులు కూడా ఫోటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఇక రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా లో ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు.

రెండు విభిన్నమైన షేడ్స్ లో కూడా కనిపిస్తాడు అని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సునీల్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే హీరోయిన్ గా కీయారా అద్వానీ నటిస్తూ ఉండగా మరొక మంచి పాత్ర కోసం అంజలిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags:    
  • MegaPowerStar 
  • RamCharan 
  • SSRajamouli 
  • Shankar 
  • RC15 
  • kiaraadvani 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS