రవితేజ ఇరగదీస్తున్నాడుగా!!

Update: 2017-02-03 06:29 GMT
మొన్ననే మాస్ రాజా రవితేజ ట్విట్టర్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మనోడు వచ్చీ రాగానే ట్విట్టర్ లో తనకు వెలకమ్ చెప్పిన వారందరికీ థ్యాంక్సులు మీద థ్యాంక్సులు చెప్పేశాడు. ఇక కొత్త సినిమాల గురించి పోస్టర్లు వేసేశాడు గాని.. వాటి గురించి ఏమన్నా చెబుతాడా అని ఎదురుచూస్తున్న టైములో.. వెంటనే ఒక సినిమా గురించి ప్రకటించేశాడు.

ఈరోజు మార్నింగ్ ''టచ్ చేసి చూడు'' సినిమా షూటింగ్ మొదలైనట్లు ఒక వీడియో మెసేజ్ ద్వారా రిలీజ్ చేశాడు రవితేజ. ''టచ్ చేసి చూడు. ఇప్పుడే ముహూర్తం అయ్యింది. షూటింగ్ మొదలవ్వబోతోంది. ఐ విల్ బి ఇన్ టచ్. హ్యావ్ ఫన్. ఇరగదీసేయండి.'' అంటూ తనదైన స్టయిల్లో తన మెసేజ్ ను పూర్తి చేశాడు రవితేజ. విక్రమ్ సిరికొండ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి అండ్ రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్లో ప్రతీ విషయం ప్రకటిస్తూ తన స్పీడుతో మాస్ రాజా అదరగొట్టేస్తున్నాడనే చెప్పాలి.

ఇకపోతే టచ్ చేసి చూడు సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యేసరికి వెంటనే ''రాజా ది గ్రేట్'' సినిమాను కూడా పట్టాలెక్కిస్తాడట. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు సినిమాలతో మన ముందుకు రానున్నాడు మాస్ రాజా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News