రాబిన్‌ హుడ్‌ గా ర‌వితేజ‌

Update: 2016-01-04 06:32 GMT
ఉన్న‌వారిని దోచుకో... లేనివాడికి పంచిపెట్టు అనేది రాబిన్‌ హుడ్ సిద్ధాంతం. తెలుగు సినిమాల్లోని క‌థానాయ‌కుల పాత్ర‌లు చాలా వ‌ర‌కు ఆ సిద్ధాంతాన్నే పోలి వుంటాయి. 'కిక్ 2`లో అయితే ర‌వితేజ క్యారెక్ట‌ర్ పేరే  రాబిన్ హుడ్.  కానీ ఆ పాత్ర అంత‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. అయితే ఇప్పుడీ పేరే ఆయన కొత్త సినిమాకు టైటిల్ గా మారిపోయిన‌ట్టు తెలిసింది. చ‌క్రి అనే  కొత్త దర్శకుడితో ర‌వితేజ ఓ  సినిమా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.  ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రూపొందించ‌నున్న ఈ సినిమాకి అన్ని ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్టు తెలిసింది. 'రాబిన్ హుడ్' అనే టైటిల్‌ ని కూడా రిజిస్ట‌ర్ చేయించార‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ లో ప్ర‌చారం సాగుతోంది. పేరునుబ‌ట్టి ఇదొక మాస్ సినిమాగా అనిపిస్తోంది.  

ఇటీవ‌ల బెంగాల్ టైగ‌ర్‌ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ర‌వితేజ  రెండు కొత్త చిత్రాల్ని ఒప్పుకొన్నారు. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎవ‌డో ఒక‌డు` ఒక‌టి కాగా,  `రాబిన్‌హుడ్`అనే సినిమా మ‌రొక‌టి. ఈ రెండు చిత్రాలూ ఒకేసారి సెట్స్‌ పైకి వెళ‌తాయ‌ని స‌మాచారం. ఇదివ‌ర‌క‌టిలా ర‌వితేజ మ‌రింత స్పీడు పెంచి ప‌నిచేయాల‌నుకొంటున్నార‌ట‌. ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమాలు యేడాదికి మూడొచ్చేవి. కానీ ఈమ‌ధ్య ఆయ‌న వేగం త‌గ్గింది. వ‌రుస‌గా కొన్ని ప‌రాజ‌యాలు ఎదురుకావ‌డ‌మే అందుకు కార‌ణం. కానీ ఇప్ప‌ట్నుంచి మాత్రం దూకుడు పెంచి ప‌నిచేయాల‌ని ఆయ‌న ఫిక్స‌యిపోయిన‌ట్టు తెలిసింది.
Tags:    

Similar News