ప్రొడ్యూస‌ర్స్‌కి ఇచ్చిప‌డేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌!

ఇండియ‌న్ బాక్సాఫీస్‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న మూవీ `ధురంధ‌ర్‌`.ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్య‌ధ‌ర్ రూపొందించిన స్పై యాక్ష‌న్ డ్రామా ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.;

Update: 2025-12-25 10:40 GMT

ఇండియ‌న్ బాక్సాఫీస్‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న మూవీ `ధురంధ‌ర్‌`.ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్య‌ధ‌ర్ రూపొందించిన స్పై యాక్ష‌న్ డ్రామా ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌ల‌తో పాటు ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.960 కోట్లు రాబ‌ట్టి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. త్వ‌ర‌లో రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేర‌బోతోంది. ఈ నేప‌థ్యంలో కొంత మంది సెక్యుల‌ర్స్ సినిమాపై విమ‌ర్శ‌లు చేస్తుంటే మ‌రి కొంత మంది ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా `ధురంధ‌ర్‌`పై మ‌రోసారి స్పందించారు. ఇండియ‌న్ సినిమాల్లో `ధురంధ‌ర్‌` గేమ్ ఛేంజ‌ర్ అని కితాబిచ్చిన వ‌ర్మ స్టార్స్‌ని, వీఎఫ్ ఎక్స్‌ని, భారీ సెట్స్‌ని, ఐట‌మ్ సాంగ్స్‌ని, హీరో వ‌ర్షిప్‌ని న‌మ్ముకుని సినిమాలు చేసే మేక‌ర్స్‌కి ఇచ్చిప‌డేశారు. `ధురంధ‌ర్‌` లాంటి పాథ్ బ్రేకింగ్‌, మోన్‌స్ట‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఇలాంటి సినిమాని కావాల‌నే ప‌ట్టించుకోరు.

ఒక పీడ‌క‌ల‌లా భావిస్తారు. కార‌ణం దాని ప్ర‌మాణాల‌కు త‌గ్గ‌ట్టుగా వారు చేయ‌లేక‌పోవ‌డ‌మే. ప్ర‌స్తుతం నిర్మాణంలో సోకాల్డ్ పాన్ ఇండియా బిగ్ ఫిల్మ్స్ విష‌యంలో దీని ఎఫెక్ట్ క‌చ్చితంగా ప‌డుతుంద‌న్నారు. వీటి క‌థ‌ల‌ని `ధురంధ‌ర్‌`కు ముందు తీసిని సినిమాల త‌ర‌హాలో రాసి తీశారు. అవి ఖ‌చ్చింత‌గా వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని వారు బ‌లంగా న‌మ్ముతున్నారు. ఇక్క‌డ ఇంకా ఆందోళ‌నక‌ర‌మైన విష‌యం ఏంటంటే `ధురంధ‌ర్‌` గొప్ప హిట్ కావ‌డ‌మే కాకుండా కానీ అది జ‌రగ‌దు. గ‌త 50 ఏళ్లుగా చర్చిస్తున్న సినిమా కూడా` అని తేల్చి చెప్పాడు.

అంతే కాకుండా `ధురంధ‌ర్‌` ఇండియ‌న్ మేక‌ర్స్ మ‌ర్చిపోలేని ఓ భ‌యాన‌క‌మైన డాగ్ అని అభివ‌ర్ణించాడు. అంతే కాకుండా మ‌రో విష‌యాన్ని కూడా ఉద‌హ‌రించాడు. `మ‌నలోని ప్ర‌తి ఒక్క‌రు మ‌రొక‌రి ఇంటికి వెళ్లిన‌ప్పుడు ఓ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నాము. ఒక‌రి ఇంటికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఓ భ‌యంక‌ర‌మైన పెద్ద డాగ్ మ‌న‌ల్ని చూస్తూ భ‌య‌పెడుతూ ఉంటుంది. దాని య‌జ‌మాని అది ఏమీ చేయ‌ద‌ని చెప్పిన‌ప్ప‌టికీ మ‌న‌లో మాత్రం దాని భ‌యం అలాగే ఉంటుంద‌న్నారు.

అంతే కాకుండా ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల్లో క‌నిపించ‌కుండా తిరుగుతూ భ‌య‌పెట్టే మోన్‌స్ట‌ర్ గా `ధురంధ‌ర్‌` మూవీని అభివ‌ర్ణించారు. ఈ సినిమాని మ‌ర్చిపోవ‌డానికి త‌మ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు కానీ వారి మైండ్‌లో ఈ సినిమా ర‌న్న‌వుతూనే ఉంటుంది. ఫార్ములా, వీఎఫ్ ఎక్స్‌, స్టార్ డ్రైవెన్ మ‌సాలా సినిమాల మాదిరిగా కాకుండా `ధురంధ‌ర్‌` స్టార్ ప‌వ‌ర్ కంటే కంటెంట్, క్రాఫ్ట్ విష‌యంలో ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటోంది. ఇప్ప‌టికీ హీరో వ‌ర్షిప్‌(హీరో ఆరాధ‌న‌) సినిమాల‌కు క‌ట్టుబ‌డి ఉన్న వారంద‌రికి `ధురంధ‌ర్‌` ఒక హార‌ర్ మూవీగా నిలుస్తుందన్నారు వ‌ర్మ‌.

`ధురంధ‌ర్‌`లో కంటెంట్ ప్ర‌ధానంగా సాగ‌డంతో స్టార్‌కు బ‌దులుగా సినిమాని అత్య‌ధిక శాతం ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డుతున్నా కార‌ణంగా మాస్ మ‌సాలా ఫార్మాట్‌లో రెగ్యుల‌ర్ టెంప్లెట్‌ల‌లో సినిమాలు తీసేవారు అదే ఫార్ములాలో బందీలుగా మిగిలిపోతారు. అయితే `ధురంధ‌ర్‌` ప్ర‌భావం నుంచి అంతా బ‌య‌ట‌ప‌డాల‌ని వీరు భావించినా `ధురంధ‌ర్‌` ప్ర‌భావం వెంటాడుతూనే ఉంటుంద‌న్నారు. అంతే కాకుండా పాత చింత‌కాల ప‌ద్ద‌తుల్ని ప‌క్క‌న పెట్టి మేక‌ర్స్ అంతా ఆదిత్య‌ధ‌ర్ చూపించిన మార్గంలో అత‌ను చూపించిన సినిమాటిక్ ప్ర‌మాణాల‌ని పాటించాల‌న్నారు. ఓ ర‌కంగా వ‌ర్మ హీరో వ‌ర్షిప్‌ని పెంచి పోషించి ఇప్ప‌టికీ అదే ఫాలో అవుతున్న మేక‌ర్స్ కు ఈ సంద‌ర్భంగా ఓ రేంజ్‌లో ఇచ్చిప‌డేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News