'సాధువులా తయారయ్యా'.. ఈషా ఫేక్ రేటింగ్ పై బన్నీ వాస్

నెగిటివ్ క్యాంపెయిన్ చిన్న ఫార్ములాతో జరుగుతుందని బన్నీ వాస్ తెలిపారు. "ప్రీమియర్స్ కు అవతలి వాళ్లు 200 టికెట్లు బుక్ చేస్తారు.;

Update: 2025-12-25 12:44 GMT

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ తాజాగా వంశీ నందిపాటితో కలిసి హారర్ థ్రిల్లర్ మూవీ ఈషాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నేడు సినిమా విడుదల అవ్వగా.. నిన్నటి ప్రీమియర్స్ తో సందడి మొదలైంది. అయితే సినిమాపై జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ తో పాటు ఫేక్ రేటింగ్ ఇష్యూపై మేకర్స్ తాజాగా స్టాండ్ ఫర్ ఈషా పేరుతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, బన్నీ వాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నెగిటివ్ క్యాంపెయిన్ చిన్న ఫార్ములాతో జరుగుతుందని బన్నీ వాస్ తెలిపారు. "ప్రీమియర్స్ కు అవతలి వాళ్లు 200 టికెట్లు బుక్ చేస్తారు. ప్రీమియర్స్ అవ్వగానే రేటింగ్ 1 1 1 అని కొట్టేస్తారు. అంతమంది రేటింగ్ ఇస్తే.. ఆటోమేటిక్ గా 5 వస్తుంది.. 300 టికెట్లు కొడితే ఇంకా కిందకి వస్తుంది. సినిమా బాగుంటే రేటింగ్ పెరుగుతుంది. యావరేజ్ గా ఉంటే 5.6 వద్దకు వచ్చి ఆగుతుంది" అని తెలిపారు.

"ప్రీమియర్ షోస్ టైమ్ లో మనల్ని దించాలనుకంటే 300-400 టికెట్స్ కొనేందుకు రూ.30000- రూ.50000 పెడితే చాలు. కానీ ఆ రేటింగ్ ను కొందరు కన్సిడర్ చేస్తారు. రివ్యూర్స్ తమ పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూ ఇస్తారు. కొందరు బాగుందంటారు.. మరికొందరు బాలేదంటారు.. కానీ ఫేక్ రేటింగ్ టపా టపా కొట్టడమే. ఎవరు కొడతారో మాకు తెలుసు" అని చెప్పారు.

"300 మంది ఫేక్ రేటింగ్ ఇస్తే.. మరో 300 మంది జెన్యూన్ రేటింగ్ ఇస్తే అసలు రేటింగ్ పెరుగుతుంది. అలా కొలమానం లేని రేటింగ్ కోసం ఎవరూ ఆలోచించొద్దు. సినిమా బాలేదంటే ఫస్ట్ షోకు పడిపోతుంది. కానీ ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. సినిమా బాగోలేకపోతే అలా జరగదు. నా దగ్గర డబ్బులు లేవు అవన్నీ కొనడానికి" అని తెలిపారు.

"బుక్ మై షోలో రేపటి 22 షోస్ ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. దీంతో మూవీ డీసెంట్ గా వెళ్తుందని అర్థమవుతోంది. ఈషా ఒక మంచి సినిమా. కానీ దాన్ని టెక్నికల్ గా ప్లాన్ తో మొత్తం మార్చేయవచ్చు. సోషల్ మీడియా వల్ల పాజిటివ్ ఎంతో నెగిటివ్ అంతే. నేను ఎంత లాస్ అయినా పక్క సినిమాలను టచ్ చేయను. అది నా సిద్ధాంతం" అని తెలిపారు.

"అలా చేస్తే మళ్లీ మనకు తగులుతాది. ఇప్పుడు ఉన్న వసూళ్లతో హ్యాపీతో ఉన్నా. కానీ ఫేక్ రేటింగ్ తో కెరీర్స్ ఎఫెక్ట్ అవుతాయి. నేను ఎప్పుడూ కూడా రివ్యూస్ ను అంగీకరిస్తా. కానీ కొన్ని చిన్న సైట్స్ లో బూతులతో రివ్యూస్ రాస్తున్నారు. దాన్ని కొందరు వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా సార్లు ఫేస్ చేశా. నా ఎమోషన్స్ అయిపోయి ఇప్పుడు సాధువులా తయారయ్యా" అంటూ వ్యాఖ్యానించారు బన్నీ వాస్.

Tags:    

Similar News