రాజే యువరాజై.. సూపర్ కూల్ డార్లింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ `ది రాజా సాబ్`. పీపుల్ మీడియా బ్యనర్‌తో కలిసి బాలీవుడ్ మేకర్ ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ `ది రాజా సాబ్`. పీపుల్ మీడియా బ్యనర్‌తో కలిసి బాలీవుడ్ మేకర్ ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. డిసెంబర్ 5న ముందురిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్ ఫైనల్‌గా సంక్రాంతికి బరిలో దిగుతున్నారు.
జనవరి 9న పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో `ది రాజా సాబ్` రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. 2025లో తను నటించిన కొత్త సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో ప్రభాస్ ఈ మూవీతో తన అభిమానుల్ని ఖుషీ చేయాలనుకుంటున్నాడట. ఇప్పటికే లిరికల్ వీడియోలతోప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్ డిసెంబర్ 27బనుంచి ప్రమోషన్స్‌ని పీక్స్‌కు తీసుకెళ్లబోతోంది.
ఈ రోజు భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈ వెంట్‌ని మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేయడంతో బిజినెస్ కూడా పతాక స్థాయిలో జరిగినట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. చాలా కూల్‌గా సాగుతూ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ శాంటా ఐడల్ ముందు కలర్ కలర్ లైట్స్ సెట్ చేసి ప్రభాస్ గిఫ్ట్స్ పేరుస్తున్న విజువల్స్, అందులో ప్రభాస్ చాలా జోవియల్‌గా కనిపిస్తున్న విధానం సినిమా ఎంత కామెడీని పంచనుందో స్పష్టం చేస్తోంది. `రాజే యువరాజై కొలిచేటి తొలి ప్రేమికుడే` అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్‌గా కూల్ విజువల్స్‌తో క్రిస్మస్‌కు రిలీజ్ చేసిన ప్రోమో అంచనాల్ని పెంచేస్తోంది. ఓ మ్యాన్షన్ నేపథ్యంలో సాగే కథగా దీన్ని తెరకెక్కించారు.
ఇందులో జరిగే వింతలు, ఆత్మలు చేసే అల్లరి ప్రధానంగా సాగనుంది. సంజయ్‌దత్ ఇందులో ప్రభాస్‌కు గ్రాండ్ ఫాదర్‌గా నటిస్తున్నాడని, అతని నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయని ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కామెడీ అంశాలతో సాగే థ్రిల్లర్ కథగా రూపొందిన ఈ సినిమా ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ టైమ్ తన పంథాకు భిన్నంగా కామెడీ థ్రిల్లర్ కథని ట్రై చేస్తున్న ప్రభాస్ `ది రాజా సాబ్`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంటా అన్నది వేచి చూడాల్సిదే.