రవితేజ - థమన్ కాంబోపై మాస్ మహారాజా ఫ్యాన్స్ గుస్సా...!
సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. 'హీరో - హీరోయిన్'.. 'హీరో - డైరెక్టర్'.. 'డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్'.. 'హీరో - మ్యూజిక్ డైరెక్టర్' ఇలా కాంబినేషన్స్ సెట్ చేస్తూ ఉంటారు. ఇక హీరో - మ్యూజిక్ డైరెక్టర్ కాంబో విషయానికొస్తే ఒక సినిమా సక్సెస్ అయితే అదే సంగీత దర్శకుడిని కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారు హీరోలు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు అప్పట్లో రాజ్ - కోటి మణిశర్మ సంగీతం ఎక్కువగా వినిపించేది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి మణిశర్మ కంటిన్యూస్ గా మ్యూజిక్ అందించాడు.. ఇప్పుడు దేవిశ్రీతో జత కట్టాడు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎక్కువగా రమణ గోగుల పాటలు వినిపించేవి. అలానే మాస్ మహారాజా రవితేజ సినిమాలకి థమన్ ఎక్కువగా డప్పులు కొడుతూ ఉంటాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సుమారు డజను సినిమాల దాకా వచ్చాయి.
'కిక్' సినిమాతో స్టార్ట్ అయిన వీరిద్దరి ప్రయాణం ఆ తర్వాత 'ఆంజనేయులు' 'వీర' 'నిప్పు' 'మిరపకాయ్' 'బలుపు' 'పవర్' 'కిక్ 2' 'అమర్ అక్బర్ ఆంథోనీ' 'డిస్కోరాజా' సినిమాల వరకు కొనసాగింది. వీటిలో కొన్ని సూపర్ హిట్స్ గా నిలవగా కొన్ని పరాజయాన్ని చవిచూశాయి. తన సినిమాలకి థమన్ సాంగ్స్ సూపర్బ్ గా ఇస్తాడని రవితేజ నమ్ముతాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పోనిలే ఏదో కొడుతున్నాడు అని సరిపెట్టేసుకుంటున్నాడు రవితేజ. అందుకే తన నెక్స్ట్ సినిమా 'క్రాక్' చిత్రాన్ని కూడా థమన్ చేతిలో పెట్టాడు. అయితే మాస్ మహారాజా ఫాన్స్ మాత్రం ఈ కాంబో పై చాలా అసంతృప్తితో ఉన్నారు. దీనికి కారణం రవితేజ లాస్ట్ మూవీ 'డిస్కోరాజా'యే కారణం. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడం రీజన్ అనుకుంటే పొరపాటే.
'డిస్కోరాజా' సినిమా విషయంలో థమన్ వ్యవహరించిన తీరే వారి అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే 'డిస్కోరాజా' సినిమా ఆడియో ఫంక్షన్ టైంలో థమన్ సంగీతం అందించిన 'అల వైకుంఠపురంలో' సక్సెస్ మీట్ కూడా జరుగుతోంది. అప్పుడు థమన్ 'డిస్కోరాజా' ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అవకుండా 'అల వైకుంఠపురంలో' సక్సెస్ మీట్ కి వెళ్లిపోవడమే రవితేజ ఫ్యాన్స్ కి చాలా కోపం తెప్పించింది. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆల్రెడీ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'అల వైకుంఠపురంలో' సక్సెస్ మీట్ కి వెళ్లడం సరికాదని మాస్ మహారాజా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా థమన్ మీద ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం 'క్రాక్' సినిమాతో పాటు మరో సినిమాకి కూడా థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పుడు అవమానించిన థమన్ కి ఇప్పుడు రవితేజ మాత్రం మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తున్నాడని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. వేరే హీరోల సినిమాలకి బాగా కేర్ తీసుకొని సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చే థమన్ మన హీరోకి ఒకటి రెండు పాటలు మంచివి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడని ఇప్పటికే వారు థమన్ మీద అసహనంతో ఉన్నారు. ఈసారైనా మంచి సాంగ్స్ ఇచ్చి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాలని మాస్ మహారాజా ఫ్యాన్స్ థమన్ కి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నారట. మరి థమన్ మాస్ మహారాజా ఫ్యాన్స్ వార్నింగ్ దృష్టిలో పెట్టుకొని మంచి ఆల్బమ్ ఇచ్చి వారి ఆగ్రహాన్ని తగ్గిస్తాడో.. మళ్ళీ రొటీన్ రొడ్డకొట్టుడు డప్పులు కొట్టి సరి పెడతాడో చూడాలి అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.