• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్‌ రాజా మరోటి...

మాస్‌ రాజా మరోటి కన్ఫర్మ్‌ చేశాడు

By - Tupaki Desk
Update: 2020-02-27 07:00 GMT
డిస్కోరాజా చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చినా కూడా రవితేజ తదుపరి చిత్రాల విషయంలో మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఆయనతో సినిమాలు తీసేందుకు కూడా నిర్మాతలు ఆసక్తి చూపించడం ఆశ్చర్యంగా ఉంది. రవితేజ సక్సెస్‌ దక్కించుకుని చాలా కాలం అయ్యింది. మద్యలో రాజా ది గ్రేట్‌ సినిమా కాకుండా అంతకు ముందు కూడా చాలా ఫ్లాప్‌ లను మన మాస్‌ రాజా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఈయన తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు.

ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సమ్మర్‌ లో ఆ సినిమా విడుదల కాబోతుంది. మరో వైపు రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో క్రాక్‌ సినిమా విడుదలైన వెంటనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రవితేజ రెడీ అయ్యాడు. దర్శకుడు త్రినాధరావు నక్కిన 2018లో హలో గురు ప్రేమకోసమే సినిమా చేశాడు. ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడు పలువురు హీరోలను కలిసినా ఎవరితోనూ వర్కౌట్‌ అవ్వలేదు.

చివరకు రవితేజతో త్రినాధరావుకు జోడీ కుదిరింది. వీరిద్దరిని కలిపింది పీపుల్స్‌ మీడియా నిర్మాణ సంస్థ. ప్రస్తుతం వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న పీపుల్స్‌ మీడియా వారు రవితేజ.. త్రినాధరావు నక్కినల కాంబో మూవీని నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. రమేష్‌ వర్మ మూవీ కంటే ముందే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్‌ వినిపిస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • Ravi Teja Next Movie with Trinadha Rao 
  • Ravi Teja Next Movie with Trinadha Rao Confirmed 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Ravi Teja Movies 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS