వైర‌స్ భ‌యంతో చ‌స్తుంటే ఆవ‌కాయ్ ప‌చ్చ‌డి కానుక‌!

Update: 2020-06-29 08:30 GMT
యు ఆర్ సో క్యూట్.. యు ఆర్ సో హ్యాండ్సమ్! అంటూ మ‌హేష్ ని ఓ రేంజులోనే ఆట ప‌ట్టించింది అమ్మ‌డు. పెళ్లాడేస్తా ప్లీజ్! అంటూ బోలెడంత బ‌ల‌వంత‌మే చేసింది. స‌రిలేరు నీకెవ్వ‌రు ట్రైన్ ఎపిసోడ్స్ లో మ‌హేష్ - ర‌ష్మిక కెమిస్ట్రీ గురించి ప్ర‌త్యేకించి చెప్పాలా?

ఆ సీన్స్ ఇంకా మ‌ర్చిపోనే లేదు. ఇప్పుడింకో సీన్ చూపించింది కుర్ర బ్యూటీ ర‌ష్మిక‌. ఇంత‌కీ ఏం చేసింది? అంటే.. ప్ర‌స్తుతం క‌రోనా వెకేష‌న్స్ లో ఉన్న ర‌ష్మిక స్వ‌స్థ‌లం కూర్గ్ లో సేద‌దీరుతోంద‌ట‌. ఖాళీ స‌మ‌యంలో ఆవ‌కాయ్ ప‌చ్చ‌డి పెట్టింది. అంతేనా.. ఆ ప‌చ్చ‌డిని రుచి చూడండి హ్యాండ్స‌మ్! అంటూ మ‌హేష్ కి పంపించింది. ఈ కానుక‌కు ఉబ్బి త‌బ్బిబ్బ‌యిన న‌మ్ర‌త ఇన్ స్టాలో పోస్ట్ చేసి బోలెడంత ప్ర‌చారం తెచ్చేసారు.

ప్రస్తుతం తన కూర్గ్ నివాసంలో ఉల్లాసంగా ఉత్సాహంగా గ‌డిపేస్తున్న ఆనందంలో ర‌ష్మిక ఏం చేస్తోందో త‌న‌కే అర్థం కావ‌డం లేన‌ట్టుంది. ఘట్టమనేనీస్‌కు బహుమతి పంపింది. కోవిడ్ -19 స‌మ‌యంలో తమ మొదటి బహుమతి హంపర్ ‌ను పంపినందుకు యువ నటికి ధన్యవాదాలు తెలిపారు. గిఫ్ట్ హ్యాంపర్లో తాజా మ్యాంగోస్.. అలాగే మామిడి పికిల్ ఉన్నాయి. మొత్తానికి ఇండ‌స్ట్రీ డీన్ న‌మ్ర‌త‌ను ఓ రేంజులోనే ఇంప్రెస్ చేసింది క‌దూ? మ‌హేష్ స‌ర‌స‌న ఇంకో సినిమా ఖాయం చేసుకోవ‌చ్చేమో!!
Tags:    

Similar News